Home Movie News ట్రైల‌ర్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న సిల్లీ ఫెలోస్..!

ట్రైల‌ర్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న సిల్లీ ఫెలోస్..!

86
0
Sillyfellows 1 mellion views

అల్ల‌రి న‌రేష్ – సునీల్ కాంబినేష‌న్లో భీమ‌నేని శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్ టైన‌ర్ సిల్లీ ఫెలోస్. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, బ్లూప్లానెట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ ట్రైల‌ర్ ను సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రిలీజ్ చేసారు. ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే…అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాల్లోని ముద్దు సీన్స్ గురించి సునీల్ చెప్పిన పంచ్ డైలాగులు యూత్ ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి.

అలాగే అల్ల‌రి న‌రేష్ హీరోయిన్ తో ఫైట్ చేస్తూ..బాహుబ‌లి డైలాగులు చెప్ప‌డం..పోసాని కృష్ణ ముర‌ళి సారీ..మిస్ట‌ర్ రాజ‌మౌళి అన‌డం..ఇక బ్ర‌హ్మానందం ఎక్స్ రేని ప‌ట్టుకుని స్కానింగ్ అన‌డం…ఇవ‌న్నీ బాగా న‌వ్విస్తున్నాయి. ఈ ట్రైల‌ర్ 1 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసి 2 మిలియ‌న్ దిశ‌గా వెళుతూ యూట్యూబ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ట్రైల‌ర్ కి వ‌స్తోన్న ట్రెమండ‌స్ రెస్పాన్స్ చూస్తుంటే… ఖ‌చ్చితంగా సిల్లీ ఫెలోస్ స‌క్స‌స్ సాధించ‌డం ఖాయం అనిపిస్తోంది. టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన సిల్లీ ఫెలోస్ సెప్టెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. మ‌రి…సిల్లీ ఫెలోస్ ఆడియ‌న్స్ ని ఎంట‌ర్ టైన్ చేసి స‌క్స‌స్ సాధిస్తార‌ని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here