Home Actor డా.రాజ‌శేఖ‌ర్ ‘అర్జున’ చిత్రం విడుదల వాయిదా. అస‌లు ఏం జ‌రిగింది..?

డా.రాజ‌శేఖ‌ర్ ‘అర్జున’ చిత్రం విడుదల వాయిదా. అస‌లు ఏం జ‌రిగింది..?

107
0


యాంగ్రీ హీరో డా.రాజ‌శేఖ‌ర్ కథానాయకుడిగా  సి.క‌ల్యాణ్ స‌మ‌ర్ప‌ణ‌లో  సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, హ్య‌పీ మూవీస్ బ్యాన‌ర్స్ పై కాంత కావూరి నిర్మిస్తున్న చిత్రం ‘అర్జున’.. పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంతో తెరకెక్కిన ఈ సినిమాకి క‌న్మ‌ణి ద‌ర్శ‌క‌త్వం వహించారు.  ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ ద్విపాత్రాభిన‌యం చేయగా మర్యం జకారియా, సాక్షి గులాటీలు హీరోయిన్లుగా  నటించారు.

 కాగా ,  తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల తేదీ ప్రకటించిన నేపథ్యంలో సినిమా రిలీజ్ కు ఇబ్బందులు ఉండడంతో విడుదలను వాయిదా వేశామని నిర్మాతలు తెలిపారు.  ఎన్నికల తర్వాత సినిమాను విడుదల చేస్తాం అని వెల్లడించారు.  కోట శ్రీనివాస‌రావు, రేఖ‌, స‌నా, ముర‌ళీ శ‌ర్మ‌, ఆనంద్‌, ప్ర‌భాక‌ర్ , బెన‌ర్జీ, చల‌ప‌తి రావు, వేణుమాధ‌వ్‌, బాబు మోహ‌న్ త‌దిత‌రులు  నటించిన ఈ సినిమా కి  ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చగా మ‌ధు నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

డా.రాజ‌శేఖ‌ర్‌, మర్యం జ‌కారియా, సాక్షి గులాటి, కోట శ్రీనివాస‌రావు, రేఖ‌, స‌నా, ముర‌ళీ శ‌ర్మ‌, ఆనంద్‌, ప్ర‌భాక‌ర్ , బెన‌ర్జీ, చల‌ప‌తి రావు, వేణుమాధ‌వ్‌, బాబు మోహ‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఫైట్స్‌:  క‌న‌ల్ క‌ణ్ణ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: మ‌ధు ఎ.నాయుడు, ఎడిట‌ర్‌:  గౌతంరాజు, మ్యూజిక్‌:  వందేమాత‌రం శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  జి.మ‌హేష్ చౌద‌రి, నిర్మాత‌:  కాంత కావూరి, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  క‌న్మ‌ణి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here