Home Actor డియర్ కామ్రేడ్.. ట్రైల‌ర్ వ‌చ్చేస్తోంది.

డియర్ కామ్రేడ్.. ట్రైల‌ర్ వ‌చ్చేస్తోంది.

60
0
డియర్ కామ్రేడ్ ట్రైల‌ర్ వ‌చ్చేస్తోంది. spiceandhra

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం.. చిత్రాల‌తో యూత్ లో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్న సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న చిత్రం డియ‌ర్ కామ్రేడ్. ఈ సినిమా ద్వారా భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ  చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది.

గీత గోవిందం సినిమాలో జంట‌గా న‌టించిన విజ‌య్ – ర‌ష్మిక మంద‌న ఈ సినిమాలో న‌టించ‌డంతో భారీ క్రేజ్ ఏర్ప‌డింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ‌,  కన్నడ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ ను  ఈ నెల 11న రిలీజ్ చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటల 11 నిమిషాలకి ట్రైలర్ ను రిలీజ్ చేయ‌నున్నారు.

 తెలుగుతో పాటు మిగతా మూడు భాషల్లోను ఇదే ముహూర్తానికి ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ఈ నెల 26న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన ఈ మూవీ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమా పై మ‌రింత క్రేజ్ పెరిగింది. మ‌రి..డియ‌ర్ కామ్రేడ్ తో విజ‌య్ ఏ స్ధాయి విజ‌యాన్ని సాధిస్తాడో చూడాలి.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here