Home Actor డియ‌ర్ కామ్రేడ్ కి ఇలా చేయ‌డం వ‌ల‌న‌ క‌లిసివ‌చ్చేనా..?

డియ‌ర్ కామ్రేడ్ కి ఇలా చేయ‌డం వ‌ల‌న‌ క‌లిసివ‌చ్చేనా..?

65
0
డియ‌ర్ కామ్రేడ్ కి ఇలా చేయ‌డం వ‌ల‌న‌ క‌లిసివ‌చ్చేనా..? spiceandhra

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ లేటెస్ట్ మూవీ డియ‌ర్ కామ్రేడ్. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. ఇటీవ‌ల విడుద‌లైన‌ ఈ సినిమాకి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ.. క‌లెక్ష‌న్స్ మాత్రం బాగానే ఉన్నాయి. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన న‌వీన్ ఎర్నేని మాట్లాడుతూ…విడుదలైన ఈ మూడు రోజుల్లో మంచి వసూళ్లు వచ్చాయి.

మూడు రోజులకు గాను 21 కోట్ల షేర్ రాబట్టింది. గ్రాస్ లో చూసుకుంటే 30 కోట్లకు పైగా రాబట్టింది. హీరో విజయ్ కున్న క్రేజ్ నేపథ్యంలో భారీ వసూళ్లు రావడం నిర్మాతలుగా మాకు ఆనందంగా ఉంది. అటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ ఉన్నాయి. అలాగే ఇతర భాషల్లో కూడా మంచి వసూళ్లు రావడం విశేషం. ఈ రోజు వీకెండ్ తరువాత కూడా అదే కలెక్షన్స్ రావడంతో బయ్యర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు.

అలాగే ఈ సినిమా నిడివి విషయంలో స్లో గా ఉందంటూ కామెంట్స్ రావడంతో 13 నిమిషాల సినిమాను ఎడిట్ చేసాం. అలాగే ఇప్పటికే ఈ సినిమాలో క్యాంటీన్ సాంగ్ బాగా పాపులర్ అయింది. నిడివి దృష్ట్యా దాన్ని పెట్టలేదు. చాలా మంది కావాలని కోరుకోవడంతో నేటినుండి ఆ సాంగ్ ని జోడించాం. ఆ పాటతో సినిమాకు ఇంకాస్త ఊపు ఇస్తుందని భావిస్తున్నాం అన్నారు. సినిమా నిడివి త‌గ్గించ‌డం… బాగా పాపుల‌ర్ అయిన క్యాంటీన్ సాంగ్ పెట్ట‌డం..వీటి వ‌ల‌న డియ‌ర్ కామ్రేడ్ కి ఎంత వ‌ర‌కు క‌లిసొస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here