Home Actor డియ‌ర్ కామ్రేడ్ సెకండ్ సింగిల్ రిలీజ్..!

డియ‌ర్ కామ్రేడ్ సెకండ్ సింగిల్ రిలీజ్..!

97
0

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక జంట‌గా న‌టించిన గీత గోవిందం సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. మ‌ళ్ళీ వీళ్లిద్ద‌రూ క‌లిసి న‌టిస్తోన్న సినిమా డియ‌ర్ కామ్రేడ్. భ‌ర‌త్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ చిత్రం రూపొందింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ మూవీ నుంచి తాజాగా సెకండ్ సింగిల్ ను విడుదల చేశారు. కడలల్లె వేచె కనులే .. కదిలేను నదిలా కలలే .. ఒడి చేరి ఒకటైపోయే .. తీరం కోరే ప్రాయం .. అంటూ ఈ రొమాంటిక్ సాంగ్ సాగుతోంది.

జస్టిన్ ప్రభాకరన్ సంగీతం .. రెహ్మాన్ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ – ఐశ్వర్య రవిచంద్రన్ ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి.  ప్రేమ పాట‌ల్లో ఉండవలసిన ఫీల్ ను ఆయన చాలా అందంగా ఆవిష్కరించారు. విన్న వెంట‌నే న‌చ్చేలా..మ‌ళ్లీ వినాలి అనిపించేలా ఉంది ఈ మెలోడి సాంగ్.  జులై 26న ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. గీత గోవిందంతో చేసిన మ్యాజిక్ ని ఈ సినిమాతో కూడా చేస్తార‌నిపిస్తుంది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here