Home Political News డిసెంబ‌ర్ 7న స‌ర్వే ఫ‌లితాలు చెబుతా – ల‌గ‌డ‌పాటి రాజ్ గోపాల్.

డిసెంబ‌ర్ 7న స‌ర్వే ఫ‌లితాలు చెబుతా – ల‌గ‌డ‌పాటి రాజ్ గోపాల్.

96
0

ల‌గ‌డ‌పాటి రాజ్ గోపాల్ ఎన్నిక‌ల టైమ్ లో స‌ర్వేలు చేయించ‌డం..స‌ర్వే ఫ‌లితాలు ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఏ చెబుతుందో దాదాపు అవే జ‌ర‌గ‌డంతో ల‌గ‌డ‌పాటి స‌ర్వేకు అటు రాజకీయ వ‌ర్గాల్లోను, ఇటు ప్ర‌జ‌ల్లోను మంచి క్రేజ్ ఉంద‌ని చెప్ప‌చ్చు. ఇదిలా ఉంటే..ఈ రోజు ల‌గ‌డ‌పాటి రాజ్ గోపాల్ తిరుమ‌ల‌లో శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ…తెలంగాణ‌లో ఎన్నిక‌ల పోరు ఆస‌క్తిక‌రంగా ఉంది. త‌న స‌ర్వే ఫ‌లితాను డిసెంబ‌ర్ 7న చెబుతాను అని చెప్పారు.

ఎన్నిక‌ల ఫ‌లితాల పై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ ఉందని… తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అభినంద‌న‌లు తెలియ‌చేస్తున్నానని అన్నారు. తొలిసారి ఎలాంటి ప్ర‌లోభాల‌కు లొంగ‌కుండా ఓటు వేయ‌బోతున్నారు. స్వ‌తంత్రులు ఎక్కువ మంది గెలిచే అవ‌కాశం ఉంది. ఇంకా స‌ర్వే ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. త‌ను ఏ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని చెప్పారు. ఏ పార్టీలోను లేను. 8 నుంచి 10 మంది వ‌ర‌కు స్వ‌తంత్ర అభ్య‌ర్ధులు గెల‌వ‌చ్చు. రోజు రెండు పేర్లు చెప్పున గెలిచే స్వ‌తంత్ర అభ్య‌ర్ధుల పేర్లు చెబుతా అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here