Home News డేటా చోరీ వ్యవహారం పై తెలంగాణ ప్రభుత్వం ,జగన్ డ్రామా ప్రజలు చూస్తున్నారు – మంత్రి...

డేటా చోరీ వ్యవహారం పై తెలంగాణ ప్రభుత్వం ,జగన్ డ్రామా ప్రజలు చూస్తున్నారు – మంత్రి దేవినేని ఉమ

66
0


సేవా మిత్ర యాప్ లో గత 30 సంవత్సరాలుగా టిడిపి కార్యకర్తలు ,బూత్ కార్యకర్తలు వివరాలు ఉన్నాయి. లోకేశ్వర్ రెడ్డి ,జగన్ కు దగ్గర బంధువు. తెలంగాణ ఎన్నికల్లో 28 లక్షల ఓట్లు తొలగించి ,అనేక అక్రమాలకు పాల్పడి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కు అధికారాలు ఉంటాయి. ఇందులో తెలంగాణ ప్రభుత్వం జోక్యం ఏంటి..? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

డేటా చోరీ వ్యవహారం, టీఆర్ఎస్ ప్రభుత్వం జోక్యం పై జాతీయ స్థాయిలో చర్చ చేపడుతాం. ఆంద్ర పోలీసులు హైదరాబాద్ వెళితే..తెలంగాణ ప్రభుత్వం కేసులు పెట్టింది. హైదరాబాద్ పై మాకూ అధికారం ఉంది. దమ్ముంటే కేసీఆర్ ముసుగు తీసి..ఏపికి రావాలి. రాం మాధవ్,కేసీఆర్, కేటీఆర్ కలిసి వైసీపీ అభ్యర్థులను నిర్ణయిస్తున్నారు. కేటీఆర్ హెచ్చరికలకు భయపడేది లేదు. ద‌మ్ముంటే అరెస్ట్ చేయండి. మీ మూలాలు ఎక్కడ ఉన్నాయి అన్నారు. మీ గత చరిత్ర ఏంటో మర్చిపోవద్దు. కేసీఆర్ కుట్రలు ,డ్రామాలు బయటపెడతాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతాం. కేసీఆర్ ప్రభుత్వం దళారీ పాత్ర పోషిస్తుంది. మా డేటా చోరీ చేసి వైసీపీకి ఇచ్చేందుకు కుట్ర చేశారు అని ఆరోపించారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here