Home Actor డైరెక్ట‌ర్ ని స్టేజ్ పైనే తిట్టేసిన‌ జీవిత‌. అస‌లు ఏం జ‌రిగింది..?

డైరెక్ట‌ర్ ని స్టేజ్ పైనే తిట్టేసిన‌ జీవిత‌. అస‌లు ఏం జ‌రిగింది..?

59
0

సినీ న‌టి జీవితను ఓ మూవీ ఫంక్ష‌న్ కి అతిథిగా పిలిచారు. ఆమె ఆ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ చేసారు. అయితే…జ‌న‌ర‌ల్ గా ట్రైల‌ర్ సూప‌ర్ గా ఉంది. ఈ సినిమా స‌క్స‌స్ అవ్వ‌డం ఖాయం. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్. ఇలా పొగ‌డ్త‌ల‌తో ముంచెస్తుంటారు. అయితే… ఫిల్మ్ ఛాంబ‌ర్ లో జ‌రిగిన వేడుక వీటికి భిన్నంగా జ‌రిగింది. ఇంత‌కీ ఏం జ‌రిగింది అంటే..ట్రైల‌ర్ చూడ‌గానే.. జీవిత‌కు బాగా కోపం వ‌చ్చింది.

అంతే…స్టేజ్ మీదే డైరెక్ట‌ర్ ని త‌న‌దైన శైలిలో తిట్టేసింది. ఇంత‌కీ అది ఆ ఫంక్ష‌న్ ఏంటంటారా..?  డిగ్రీ కాలేజ్ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ ఫంక్షన్. ఈ మూవీ డైరెక్ట‌ర్ న‌ర‌సింహ నంది. ఆ ట్రైల‌ర్ నిండా బూతులే. పైగా శృంగారం డోసు మ‌రింత ఎక్కువ‌గా ఉంది. అది చూసి జీవితకు కోపం వ‌చ్చింది. గ‌తంలో మీరు మంచి సినిమాలే తీసారు క‌దా.. ఇప్పుడేంటి ఇలాంటి బూతు సినిమా తీసారు..? సెన్సార్ బోర్డ్ స‌భ్యురాలు అయిన‌ న‌న్ను అతిథిగా పిలుస్తారా అంటూ ద‌ర్శ‌కుడ్ని స్టేజీ పైనే క‌డిగేసింది.

దాంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు జీవిత‌కు స‌ర్ధి చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. అయితే…త‌ప్ప‌క నాలుగు మాట‌లు మాట్లాడేసి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు జీవిత‌. అదీ..సంగ‌తి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here