Home Actor డైలాగ్ రైట‌ర్ గా మారిన సింగ‌ర్..!

డైలాగ్ రైట‌ర్ గా మారిన సింగ‌ర్..!

82
0

డైలాగ్ రైట‌ర్ గా మారిన సింగ‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారా..?   రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ బ్ర‌ద‌ర్ సాగ‌ర్. అచ్చు దేవిశ్రీని పోలి ఉండే ఆయన తమ్ముడు సాగర్ కూడా మంచి సింగర్ అనే విషయం తెలిసిందే. అంతే కాదు తమ్ముడికి తన సినిమాల్లోని అక్కడక్కడా కొన్ని పాటలు పాడే అవకాశం కూడా ఇచ్చారు దేవి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ఆర్య లోని ‘ఏదో ప్రియరాగం వింటున్నా…’ పాటను ఆలపించిన సాగర్ కు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు కూడా లభించింది.

 బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కలయికలో రాబోతున్న సినిమా రాక్షసుడు. ఈ సినిమా ద్వారా సాగ‌ర్ డైలాగ్ రైటర్ గా మారుతున్నట్లు దేవిశ్రీప్రసాద్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియచేసారు. తన తండ్రి గారైన దివంగత సత్యమూర్తి గారి వలే తమ్ముడు కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదిగేలా మీ అందరూ సాగర్ ని ఆశీర్వదించాలి అంటూ దేవిశ్రీ తన పోస్ట్ లో కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here