Home Actor డోంట్ వ‌ర్రీ స్టే హిప్పీ. మ‌రి.. హిప్పీకి హిట్ వ‌చ్చేనా..?

డోంట్ వ‌ర్రీ స్టే హిప్పీ. మ‌రి.. హిప్పీకి హిట్ వ‌చ్చేనా..?

65
0


ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ న‌టిస్తున్న తాజా చిత్రం హిప్పీ. ఈ చిత్రానికి టి.ఎన్.కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌లైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ ఎక్స్ 100 త‌ర్వాత హీరో కార్తికేయ క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కార్తికేయ‌ తదుపరి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా చిత్రం హిప్పీ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇందులో కార్తికేయ స‌ర‌స‌న దిగాంగ‌న న‌టిస్తోంది.

తాజాగా ఈ మూవీ టీజర్ ను హీరో నాని చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఈ సినిమా ఆర్ ఎక్స్ 100కి మించిన స‌క్స‌స్ సాధించాల‌ని కావాలంటూ టీమ్ కి నాని బెస్ట్ విషెస్ తెలియజేశాడు. అలాగే మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ కూడా ఈ మూవీ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.  కార్తికేయ ఈ సినిమాలో ప్లే బాయ్ లా కనిపించనున్నాడని ఈ టీజర్ ను బట్టి తెలుస్తోంది. కలైపులి థాను నిర్మిస్తోన్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోను ఈ వేసవిలో విడుదల చేయనున్నారు. మ‌రి…ఆర్ ఎక్స్ 100తో సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన కార్తికేయ హిప్పీతో ఎలాంటి హిట్ సాధిస్తాడో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here