Home Actor డ‌బ్బింగ్ స్టార్ట్ చేసిన బ‌న్నీ.

డ‌బ్బింగ్ స్టార్ట్ చేసిన బ‌న్నీ.

27
0
డ‌బ్బింగ్ స్టార్ట్ చేసిన బ‌న్నీ. SPICEANDHRA

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారిక & హాసిని సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఓ వైపు షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గానే… మ‌రో వైపు డ‌బ్బింగ్ స్టార్ట్ చేసారు. ఈ రోజు పూజా కార్య‌క్ర‌మాలతో డ‌బ్బింగ్ వ‌ర్క్ స్టార్ట్ చేసారు.

అల్లు అర్జున్ ఈ రోజు నుంచే డ‌బ్బింగ్ చెబుతున్నారు. బ‌న్నీ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి డిజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చిత్రంలో న‌టించారు. రెండవ కథానాయికగా నివేదా పేతురాజ్ నటిస్తుండగా, నవదీప్, సుశాంత్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న మూడ‌వ సినిమా ఇది.

గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాలు చేసారు. ఈ రెండు సినిమాలు స‌క్స‌స్ సాధించ‌డంతో ఈసారి హ్యాట్రిక్ సాధించ‌డం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. ఈ భారీ క్రేజీ మూవీని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here