Home Political News ఢిల్లీకి చేరుకున్న పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ – రాహుల్ ప‌ర్య‌ట‌న పై చ‌ర్చ‌..!

ఢిల్లీకి చేరుకున్న పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ – రాహుల్ ప‌ర్య‌ట‌న పై చ‌ర్చ‌..!

94
0

టీఆర్ఎస్ కి దీటుగా కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారం చేస్తుండ‌డం..ప‌క్కా ప్లాన్ తో ముందుకు వెళుతుండ‌డంతో రోజురోజుకు తెలంగాణ ఎన్నిక‌ల్లో ఉత్కంఠ పెరుగుతోంది. టీఆర్ఎస్ కు తిరుగులేదు అనుకున్న‌ప్ప‌టికీ..టిక్కెట్ రాని టీఆర్ఎస్ నేత‌ల్లో అసంతృప్తి…కాంగ్రెస్ నేత‌ల ప్ర‌ణాళిక చూసి..టీఆర్ఎస్  ప్ర‌స్తుతం టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్టు అనిపిస్తుంది. దీంతో రోజురోజుకు తెలంగాణ ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు ఎలా వ‌స్తాయ‌నేది ఆస‌క్తిగా మారింది. ఇదిలా ఉంటే… తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీట్ల స‌ర్ధుబాటు విష‌య‌మై కూట‌మి నాయ‌కుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది.

ఈ చ‌ర్చ‌ల సారాంశాన్ని హైక‌మాండ్ కి తెలియ‌చేసేందుకు పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గులామ్ న‌బీ ఆజాద్ ని క‌లిసి రాష్ట్రంలో కూటిమిలో ఉన్న ఇత‌ర పార్టీల సీట్ల స‌ర్ధుబాటు విష‌య‌మై చ‌ర్చించ‌నున్నారు. అలాగే ఈ నెల 20న రాష్ట్రంలో రాహుల్ ప‌ర్య‌ట‌న పై కూడా చ‌ర్చించ‌నున్నార‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే..నాలుగున్న‌రేళ్ల‌లో కేసీఆర్‌ పాలనలో తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవబోతోందని, గెలిచాక రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా తాము అమలు చేయబోయే విషయాలను గత ఏడాది నుంచి చెబుతున్నాం అని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here