Home News తాయిలాలు టీడీపీని గట్టెక్కించేనా..?

తాయిలాలు టీడీపీని గట్టెక్కించేనా..?

110
0

సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం అధికార తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. పసుపు కుంకుమ, నిరుద్యోగ భృతి,  పింఛన్ల మొత్తం పెంపు,  రైతుబంధు,  ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణ,  ఫీజు రియంబర్స్మెంట్ పెంచటం,  రేషన్ కార్డులను అత్యంత సులువుగా జారీ చేయడం,  వివిధ కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా అన్ని వర్గాల ఓట్లను కొల్ల కొట్టాలన్నది టీడీపీ వ్యూహం. 

పసుపు కుంకుమ,  రైతుబంధు,  ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ప్రకటించకముందు టిడిపి గ్రాఫ్ కాస్త దిగువనే ఉంది.  13 జిల్లాల కలెక్టర్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చిన సమాచారం లో కూడా టిడిపి గెలుపు కష్టమేనని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో గెలుపు ఓటముల మధ్య తేడా  కేవలం 2% ఓట్లు. జనంలో ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నందున టీడీపీ ఓటు బ్యాంకు కాస్త  తగ్గుతుందని,  జనసేన ఎలాగూ దూరమైంది కాబట్టి సైకిల్ కి పంచర్ తప్పదని వైసీపీ భావించింది.

కానీ.. గత నెల రోజుల  వ్యవధిలో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది.  సంక్షేమ పథకాల ప్రకటన,  చెక్కుల పంపిణీ తరువాత టీడీపీ నాయకత్వం వివిధ రూపాల్లో సర్వే చేయించింది. కనీసం నాలుగు నుంచి 8 శాతం ఓట్లు పెరుగుతాయని తేలింది. అంతే కాదు ఈసారి వందకు మించిన స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని కొన్ని సర్వేల్లో వెల్లడైంది. ఈ పరిణామాలు వైసీపీలో కొంత అసహనానికి దారితీశాయి.  టీడీపీకి కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ నాయకత్వం  కొంత ప్రయత్నం చేసింది. జగన్ తన నవరత్నాల పథకాలను చంద్రబాబు కాపీ కొట్టి అమలు చేస్తున్నారని ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇది అంతగా జనంలోకి  వెళ్లినట్లు లేదు.

కొన్ని జిల్లాల్లో ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ప్రజాభిప్రాయం గురించి  ఆరా తీయగా కొన్ని విషయాలు వెల్లడయ్యాయి.  దాదాపు 60 శాతం మంది చంద్రబాబు ఇచ్చిన పథకాలపై సానుకూలంగా మాట్లాడారు.  కనీసం  30 శాతం  మంది సంక్షేమ ఫలాలను అందుకున్నా  చంద్రబాబుకు ఓటు వేయబోమని తేల్చి చెప్పారు.  మిగిలిన 10 శాతం మంది ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  ఓవరాల్ గా చూస్తే సంక్షేమ పథకాలు టిడిపికి కొంతవరకు లభించే అవకాశాలు సుస్పష్టం.

కానీ.. ఇక్కడో   చిక్కు ఉంది.  ఉత్తరాంధ్రలోని చాలా గ్రామాల్లో మత్స్యకారులు,  వడ్డీలు,  రెడ్డి కలు,  రెల్లి కుల స్తులు,  మరికొన్ని సామాజిక వర్గాల్లో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి.  వారి వారి నాయకులు ఏం చెబితే అదే చేస్తారు.  ఇది అభ్యర్థుల గెలుపోటములను కీలకంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఈ వర్గాల జనాభాలో నూరు శాతం పోలింగ్ నమోదవుతుంది.  కాబట్టి ఆయా వర్గాల నాయకులు  కొంతవరకు కీలకం కానున్నారు.  ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను అందుకున్న సరే సంఘ నాయకులు వేరే పార్టీకి ఓటేయమంటే వేస్తామని చెప్పిన వాళ్లు ఎక్కువగానే ఉన్నారు.  ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీ జనసేన ఎలా ముందుకు వెళతాయో చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here