Home Actor తార‌క్ త‌దుప‌రి చిత్రం ఖ‌రారైందా..?  ఇంత‌కీ.. ఎవ‌రితో..?

తార‌క్ త‌దుప‌రి చిత్రం ఖ‌రారైందా..?  ఇంత‌కీ.. ఎవ‌రితో..?

14
0
తార‌క్ త‌దుప‌రి చిత్రం ఖ‌రారైందా..? ఇంత‌కీ.. ఎవ‌రితో..? spiceandhra

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత తార‌క్.. కె.జి.ఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో సినిమా చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. తార‌క్ – ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో రూపొందే ఈ భారీ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది.

ఈ నిర్మాణ సంస్థ కూడా ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ మూవీ గురించి స్పందించ‌డం.. వ‌చ్చే సంవ‌త్స‌రం చివ‌రిలో ఉండ‌చ్చు అని చెప్ప‌డంతో ఈ ప్రాజెక్ట్ క‌న్ ఫ‌ర్మ్ అనుకున్నారు. అయితే… తాజాగా తార‌క్ త‌దుప‌రి చిత్రం గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తో తార‌క్ సినిమా చేయాల‌నుకుంటు న్నాడ‌ట‌.

ఈ మూవీని హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంద‌ట‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఇటీవ‌ల అర‌వింద స‌మేత సినిమా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. వ‌చ్చే సంవ‌త్స‌రం స‌మ్మ‌ర్ లో ఈ సినిమా స్టార్ట్ కానుందని టాక్ వినిపిస్తోంది. మ‌రి… ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మేనా..?  కాదా..?  అనేది తెలియాల్సివుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here