Home Movie News తిత్లీ తుఫాన్ స‌హాయ నిధికి ల‌క్ష రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించిన ద‌ర్శ‌కుల సంఘం..!

తిత్లీ తుఫాన్ స‌హాయ నిధికి ల‌క్ష రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించిన ద‌ర్శ‌కుల సంఘం..!

99
0

ఇటీవల సంభవించిన తిత్లీ తుఫాను ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసి తీవ్ర నష్టాన్ని కలిగించిన విషయం తెల్సిందే. ఇలాంటి ఆపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు చిత్రపరిశ్రమ నుండి తక్షణ స్పందన వస్తుందన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. ఈ విపత్తు పై స్పందించిన  కొందరు సినీ ప్రముఖులు ఇప్పటికే తమ విరాళాలు ప్రకటించటం జరిగింది.

ఈ నేపథ్యంలో మా “తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం” కూడా స్పందిస్తూ తిత్లీ తుఫాను సహాయ నిధికి రూ. 1,00,000 (లక్ష రూపాయల) విరాళాన్ని అందజేస్తున్నాం. ఈ మేరకు నిన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలుగు చ‌ల‌న‌చిత్ర ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షుడు ఎన్.శంక‌ర్ తెలియ‌చేసారు.

అసోసియేషన్ సభ్యులు కొందరు వ్యక్తిగత హోదాలో కూడా విరాళాలు ఇస్తామని హామీ ఇచ్చిన మీదట అవి కూడా వసూలు చేసి ఒకే మొత్తంగా తుఫాను బాధితుల సహాయనిధికి అంద‌చేస్తాం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here