Home Movie News తిత్లీ బాధితుల కోసం 25 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించిన బాల‌య్య‌.!

తిత్లీ బాధితుల కోసం 25 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించిన బాల‌య్య‌.!

102
0

తిత్లీ తుఫాను ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసి తీవ్ర నష్టాన్ని కలిగించిన విషయం తెల్సిందే. ఈ విపత్తు పై స్పందించిన  కొందరు సినీ ప్రముఖులు ఇప్పటికే తమ విరాళాలు ప్రకటించటం జరిగింది. నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్, యువ హీరోలు నిఖిల్, వ‌రుణ్ తేజ్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సంపూర్ణేష్ బాబు త‌దిత‌రులు విరాళాలు ప్ర‌క‌టించారు. ద‌ర్శ‌కుల సంఘం ల‌క్ష రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించింది.

క‌ష్టంలో ఉన్న‌పుడు చేయూత అందించే చేయి..ఆపద అంటే ముందు వెన‌క ఆలోచించుకుండా వెంట‌నే ఆదుకునే మ‌నిషి..ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా నేనున్నాను అంటూ ముందుకొచ్చే మంచి మ‌న‌సు..అన్నీ క‌ల‌గలిపిన రూపం శ్రీ నంద‌మూరి బాల‌కృష్ణ. శ్రీ‌కాకుళం తిత్లీ బాధితులకు 25 ల‌క్ష‌ల విరాళం అందించి బాల‌కృష్ణ గొప్ప మ‌న‌సు చాటుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here