Home Political News తిరుప‌తిలో ప‌వ‌న్ ని క‌లిసిన‌ నాదెండ్ల‌ మ‌నోహ‌ర్‌..!

తిరుప‌తిలో ప‌వ‌న్ ని క‌లిసిన‌ నాదెండ్ల‌ మ‌నోహ‌ర్‌..!

92
0

మాజీ స్పీక‌ర్ శ్రీ నాదెండ్ల‌ మ‌నోహ‌ర్, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిర కాలంగా స్నేహితులు. జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం నుంచి జ‌న‌సేన సైద్ధాంతిక విధానాల పై మ‌నోహ‌ర్..ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో మాట్లాడుతూనే ఉన్నారు. నాలుగేళ్లుగా జ‌న‌సేన పార్టీ స‌భ‌లు, ప‌వ‌న్ ప్ర‌సంగాల‌ను ప‌రిశీలిస్తూ త‌న అభిప్రాయాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెప్పేవారు. ఇప్పుడు జ‌న‌సేన పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నెల 12న పార్టీలో చేరేందుకు ముహుర్తం కూడా ఖ‌రారు చేసారు.

ఈరోజు నాదెండ్ల మ‌నోహ‌ర్ తిరుప‌తిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని క‌లిసారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ…ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాల‌ను నాదెండ్ల మ‌నోహ‌ర్ ఎంతో హుందాగా, రాజ‌కీయ ప‌క్ష‌పాతానికి అతీతంగా న‌డిపారు. అసెంబ్లీ స్పీక‌ర్‌గా మ‌నోహ‌ర్ అధికార ప‌క్షంతో పాటు ప్ర‌తిప‌క్షం మ‌న్న‌న‌లు కూడా పొంద‌డం ఆయ‌న‌లోని రాజ‌కీయ విలువ‌ల‌కు ద‌ర్ప‌ణం ప‌డుతోంది. మ‌నోహ‌ర్ రాక‌తో పార్టీ ఆశ‌యం మ‌రింత బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తుంద‌న్న న‌మ్మ‌కం ఏర్ప‌డింది అన్నారు. ఇద్ద‌రు యువ నేత‌ల క‌ల‌యిక తెలుగు రాష్ట్రాల‌తో పాటు భార‌త దేశంలో, యువ‌కుల‌కి మ‌రింత స్ఫూర్తినిస్తుంద‌ని జ‌న‌సేన పార్టీ వ‌ర్గాలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here