Home Actor తిరుమ‌ల‌లో అఖిల్ అక్కినేని. ఎందుకో తెలుసా..?

తిరుమ‌ల‌లో అఖిల్ అక్కినేని. ఎందుకో తెలుసా..?

60
0
తిరుమ‌ల‌లో అఖిల్ అక్కినేని. ఎందుకో తెలుసా..? spiceandhra

అక్కినేని అఖిల్ న‌టించిన  అఖిల్, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను.. ఈ మూడు సినిమాలు ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయాయి. దీంతో నాలుగ‌వ సినిమా పై అఖిల్ తో పాటు అభిమానులు కూడా చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే… అఖిల్ తాజా చిత్రానికి బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై  బ‌న్నీవాసు,వాసు వ‌ర్మలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే నెల‌లో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్ పైకి వెళ్ల‌లేదు. హీరోయిన్ ఎవ‌ర‌నేది ఫైన‌ల్ కాక‌పోవ‌డం వ‌ల‌నే షూటింగ్ ఇంకా స్టార్ట్ చేయ‌లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నెల‌లోనే సెట్స్ పైకి వెళుతుంద‌ని టాక్ వ‌చ్చింది.

ఇదిలా ఉంటే… అఖిల్ ఈ రోజు ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ… నాలోని శక్తిని తెలుసుకునే సరైన ప్లేస్‌ తిరుమల. ఏడు కొండలు నడిచి శ్రీవారి దర్శనానికి వచ్చాను. కొత్త సినిమాను ఫోకస్డ్‌గా మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నా గోవిందా గోవిందా అంటూ ట్వీట్ చేశాడు. సో.. అఖిల్ – బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ సినిమా త్వ‌ర‌లోనే స్టార్ట్ కాబోతుంది. మ‌రి.. ఈ సినిమాతో అయినా అఖిల్ స‌క్స‌స్ సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here