Home Political News తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు షాక్ ఇచ్చిన ద‌ళితులు..!

తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు షాక్ ఇచ్చిన ద‌ళితులు..!

90
0

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ నాయకులకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ప్రచారానికి వెళ్లిన నేతలకు గతంలో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు చేదు అనుభం ఎదురైంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే…ఖ‌మ్మం జిల్లా కూసుమంచి మండ‌లం నేల‌ప‌ట్ల గ్రామంలో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి ఓటు వేసి గెలిపించాల‌ని కోరుతూ ప్ర‌చారం చేస్తున్నారు.

అయితే..తుమ్మ‌ల నాగేశ్వ‌రావు ప్ర‌చారాన్ని ద‌ళితులు అడ్డుకున్నారు. ప‌ట్టాలిచ్చారు..భూములు చూపించ‌లేదు కార‌ణం ఏంటి అంటూ నిల‌దీసారు. త‌మ ప‌ట్ల టీఆర్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ని రోడ్డు పై బైఠాయించి ఆందోళ‌న చేప‌ట్టారు.  నాలుగేళ్ల తర్వాత తీరిగ్గా వచ్చి ఓట్లు అడుగుతున్నరా..?  ఎందుకు వేయాలి.? అని ఘాటుగా ప్రశ్నించారు. ఊహించ‌ని ఈ సంఘ‌ట‌న‌తో షాక్ అవ్వ‌డం టీఆర్ఎస్ నేత వంతయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here