Home News తెనాలిలో అభిమాన సందోహం మ‌ధ్య‌ నామినేష‌న్ వేసిన జ‌న‌సేన నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్.

తెనాలిలో అభిమాన సందోహం మ‌ధ్య‌ నామినేష‌న్ వేసిన జ‌న‌సేన నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్.

112
0


గుంటూరు జిల్లా తెనాలిలో జ‌న‌సేన అభ్య‌ర్ధి నాదెండ్ల మ‌నోహ‌ర్ నామినేష‌న్ దాఖ‌లు చేసారు. ఆయ‌న‌ స్వ‌గ్రామం నుంచి ఊరేగింపుగా వెళ్లి  త‌హిశీల్ధార్ ఆఫీస్ లో నామినేష‌న్ వేసారు. జ‌న‌సేన జెండాను ప‌ట్టుకుని యువ‌కులు క‌వాతు నిర్వ‌హించారు. అభిమానులు, కార్య‌క‌ర్త‌ల సందోహం మ‌ధ్య కోలాహాలంగా ఈ కార్య‌క్ర‌మం సాగింది.

ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన నాయ‌కుడు, తెనాలి అసెంబ్లీ అభ్య‌ర్ధి నాదెండ్ల మ‌నోహ‌ర్ మాట్లాడుతూ.…రాజ‌కీయాల్లో కొత్త ఒర‌వ‌డికి జ‌న‌సేన శ్రీకారం చుట్టింది. అవినీతిలేని పాల‌న అందించేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు జ‌న‌సేన పార్టీ పెట్టారు. ప‌వ‌న్ సంకల్పానికి ప్ర‌జ‌లంతా మ‌ద్ద‌తు తెల‌పాలి. రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రూ మార్పు కోరుకుంటున్నారు. ప్ర‌తి ఒక్క‌రికి స‌మాన అవ‌కాశాలు ఇవ్వాలి.

దేశం ముందుకు వెళ్ల‌డానికి జ‌నసేన చేస్తున్న ప్ర‌య‌త్నంలో భాగంగా పోటీ చేస్తున్నాను. గ్రామ‌గ్రామాల నుంచి నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు, స‌న్నిహితుల‌కు పేరుపేరున కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేస్తున్నాను. అలాగే పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చిన మ‌హిళ‌ల‌కు మ‌న‌స్పూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను.  ప్ర‌తి కుటుంబానికి మేలు జ‌రిగేలా ప్ర‌య‌త్నం చేస్తాం. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి జ‌న‌సేన పార్టీని గెలిపించాల‌ని కోరుతున్నాను అన్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here