Home News తెనాలిలో జ‌న సైనికుల‌తో క‌లిసి నాదెండ్ల మ‌నోహ‌ర్ ఇంటింటికి ప్ర‌చారం..!

తెనాలిలో జ‌న సైనికుల‌తో క‌లిసి నాదెండ్ల మ‌నోహ‌ర్ ఇంటింటికి ప్ర‌చారం..!

140
0


తెనాలిలో ఇంటింటికి ప్ర‌చారం చేపట్టారు జ‌న‌సేన అభ్య‌ర్ధి నాదెండ్ల మ‌నోహ‌ర్. ప‌ర్య‌న‌ట‌లో ప‌లు చోట్ల ఆయ‌న‌కు మంగ‌ళ‌హార‌తుల‌తో స్వాగతం ప‌లికారు. యువ‌త ఉత్సాహంగా ఈ ప్ర‌చారంలో పాల్గొన్నారు. త‌ను చేసిన అభివృద్ధిని కొన‌సాగించేందుకు ఓటు అడుగుతున్న‌ట్టు నాదెండ్ల మ‌నోహ‌ర్ తెలియ‌చేసారు. త‌న‌ని గెలిపిస్తే..తెనాలి అభివృద్ధికి పాటు ప‌డ‌తాన‌న్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నాదెండ్ల మ‌నోహ‌ర్ మాట్లాడుతూ…5 ఏళ్ల‌ల్లో ప్ర‌భుత్వం కొంత మందికే ఉప‌యోగ‌ప‌డింది త‌ప్పా…పేద ప్ర‌జ‌ల‌కు, బ‌ల‌హీన వ‌ర్గాల‌ను ఆదుకోలేక‌పోయింది.

జ‌న‌సేన పార్టీలో ఉన్న ప్ర‌ధాన‌మైన సిద్ధాంతం నూటికి నూరు శాతం అంద‌ర్నీ సమాజంలో ఇంకా పై స్ధాయికి తీసుకురావ‌డం. దీని కోసం క‌ష్ట‌ప‌డుతున్నాం. జ‌న సైనికుల‌తో క‌లిసి ఇంటింటికి వెళ్ళి ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌డం చాలా సంతోషంగా అనిపించింది. అయితే…ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్న‌ప్పుడు వాళ్లు కోరింది ఏంటంటే…ఇళ్ల స్ధ‌లాల గురించి. తెనాలిలో జ‌రిగిన ఫ్లాట్ల నిర్మాణంలో అవ‌కాశం క‌ల్పిస్తే బాగుంటుంద‌ని రిక్వెస్ట్ చేసారు. ప్ర‌భుత్వం అర్హులైన వాళ్ల‌కి ఇళ్ల స్ధలాలు ఇచ్చి ఆదుకుని ఉంటే బాగుండేది కానీ అలా జ‌ర‌గ‌లేదు.

స్ల‌మ్స్ బాగా పెరిగిపోతున్నాయి. పేద‌రికంలో బాగా ఇబ్బంది ప‌డుతున్నారు. అందుచేత ప‌క్కా గృహ నిర్మాణం అనేది చాలా అవ‌స‌రం. జ‌న‌సేన పార్టీ ఎవ‌రు ఆలోచించ‌ని విధంగా అంద‌రికీ గ్రౌండ్ ఫ్లోర్ లోనే నిర్మాణం చేసేట‌ట్టు ప్లాన్ చేసాం. కొంత మంది దివ్యాంగులు పేద‌రికంలో చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు. వీరంద‌ర్నీ దృష్టిలో పెట్టుకునే వినూత్నంగా నిర్మాణం చేప‌ట్టాలి అనుకుంటున్నాం. ఖ‌చ్చితంగా జ‌న‌సేన ప్ర‌భుత్వం వ‌స్తుంది. అంద‌రికీ మంచి జ‌రుగుతుంద‌నే ఆశాభావం వ్య‌క్తం చేసారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here