Home News తెనాలి జ‌న‌సేన అభ్య‌ర్థి నాదెండ్ల మ‌నోహ‌ర్ ఏం చేసారో తెలిస్తే..ఖ‌చ్చితంగా ఆయ‌న‌కే ఓటు వేస్తారు..!

తెనాలి జ‌న‌సేన అభ్య‌ర్థి నాదెండ్ల మ‌నోహ‌ర్ ఏం చేసారో తెలిస్తే..ఖ‌చ్చితంగా ఆయ‌న‌కే ఓటు వేస్తారు..!

84
0


జ‌న‌సేన పార్టీ త‌రుపున తెనాలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాదెండ్ల మ‌నోహ‌ర్ పోటీ చేస్తున్నారు. సీనియ‌ర్ నాయ‌కుడు అయిన నాదెండ్ల మ‌నోహ‌ర్ ఖ‌చ్చితంగా తెనాలి నుంచి భారీ మెజార్టీతో గెలుస్తార‌ని… ఆయ‌న చేసిన అభివృద్ధే ఆయ‌న్ని గెలిపిస్తుంద‌ని ఓట‌ర్లు, రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. అస‌లు…తెనాలి కోసం నాదెండ్ల మ‌నోహ‌ర్ ఏం చేసారో చెప్పాలంటే ముందుగా ఆయ‌న గురించి చెప్పాలి.

నాదెండ్ల మ‌నోహ‌ర్ స్వ‌గ్రామం కొల్లూరు మండ‌లంలోని దోనేపూడి. ఆయ‌నకు చిన్న‌ప్ప‌టి నుంచి తెనాలి నియోజ‌క‌వ‌ర్గంతో అనుబంధం ఏర్ప‌డింది. ఎలా అంటే… ప్ర‌తి సంవ‌త్స‌రం పండ‌గ అప్పుడో.. స్కూల్ స‌మ్మ‌ర్ హాలీడేస్ లోనో అక్క‌డ‌కు వెళ్లేవారు. తెనాలి కాలువ మీద నుంచి వెళ్లాలంటే ప్ర‌తి ఒక్క‌రు ఆ రోజు భ‌య‌ప‌డేవాళ్లు. అది ఆయ‌న‌కు బాగా గుర్తుంది. అందుక‌నే ఆయ‌న ఎమ్మెల్యే అయిన త‌ర్వాత ర‌హ‌దారుల పై ప్ర‌త్యేక దృష్టి పెట్టి ఎంత‌గానో అభివృద్ది చేసారు. అలాగే రాత్రిప‌గ‌లు క‌ష్ట‌ప‌డి ప్ర‌త్యేకంగా ప్ర‌తి కుటుంబాన్ని క‌లిసి వాళ్ల ఆర్ధిక ప‌రిస్థితులు గురించి తెలుసుకుని ప్ర‌భుత్వం త‌రుపున 2004 నుంచి 2014 వ‌ర‌కు ఎంత‌గానో స‌హాయం చేసారు.

 గ్యాస్ క‌నెక్ష‌న్స్, రేష‌న్ కార్డులు, ఇళ్ల ప‌ట్టాలు..ఇలా ప్ర‌జ‌ల‌కు ఎన్నో ర‌కాలుగా సేవ చేసారు. తెనాలికి ఒక ప్ర‌ణాళిక రూపొందించి ఆ ప్ర‌కారం అభివృద్ధి చేసుకుంటూ వెళ్లారు. ర‌క్షిత మంచి నీటి ప‌థ‌కం కావాలి అంటే.. స్టార్టింగ్ లో చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారట‌. తెనాలికి ఏం అవ‌స‌రం అని. ఎందుకు ఇంత ఖ‌ర్చు చేస్తున్నారు అనుకున్నారు. అయితే…తెనాలి నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌తి ఇంటికి కుళాయి ద్వారా నీళ్లు అందించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ర‌క‌ర‌కాల ప్రొగ్రామ్స్ నుంచి నిధులు తీసుకువ‌చ్చి ట్యాంక్స్ నిర్మాణం చేసి ప్రకాశం బ్యారేజీ నుంచి పైప్ లైన్ వేసుకుంటూ 2030, 2050 సంవ‌త్స‌రాల వ‌ర‌కు కూడా తెనాలికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి సౌక‌ర్యం అందించేలా ఒక మంచి కార్య‌క్ర‌మం చేసారు.

ఇలా ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేసారు. ఈసారి త‌న‌ని గెలిపిస్తే.. ప్ర‌జ‌లు గ‌ర్వ‌ప‌డే విధంగా  సేవ‌లు అందిస్తానంటున్నారు నాదెండ్ల మ‌నోహ‌ర్. మంచి పాల‌న అందించిన నాయ‌కుల‌ను ప్ర‌జ‌లు ఎల్ల‌ప్పుడూ ఆద‌రిస్తుంటారు. అందుచేత తెనాలి మ‌రింత‌గా అభివృద్ధి చేయ‌డం కోసం  గాజు గ్గాసు గుర్తు పై ఓటు వేసి నాదెండ్ల మ‌నోహ‌ర్ ని భారీ మెజార్టీతో గెలిపిస్తార‌ని ఆశిద్దాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here