Home Political News తెలంగాణ‌కు చంద్ర‌బాబు అవ‌స‌ర‌మా..?  కేసీఆర్

తెలంగాణ‌కు చంద్ర‌బాబు అవ‌స‌ర‌మా..?  కేసీఆర్

100
0

సూర్యాపేట‌లో టీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భలో కేసీఆర్ చంద్ర‌బాబు పై మండిప‌డ్డారు. సూర్యాపేట రాజ‌కీయంగా చైత‌న్యం ఉన్న ప్రాంతం. ఎన్నిక‌ల్లో నాయ‌కులు కాదు ప్ర‌జ‌లు గెల‌వాలి అప్పుడే ప్ర‌జాస్వామ్యం ముందుకు వెళుతుంది అన్నారు. ఓటు అంటే ఆషామాషీ కాదని… అదే మ‌న భ‌విష్య‌త్ అని చెప్పారు. విద్యుత్ శ‌క్తి రంగంలో నెంబ‌ర్ వ‌న్ గా ఉన్నాం. రాత్రీ ప‌గ‌లు క‌ష్ట‌ప‌డితే ఈ స్ధాయికి చేరుకున్నాం. ఎన్నిక‌ల పై ప్ర‌తి గ్రామంలో చ‌ర్చ జ‌ర‌గాలి. సూర్యాపేట‌ను జిల్లాగా చేసిన ఘ‌న‌త జ‌గ‌దీష్ రెడ్డిదే అన్నారు.

కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీ గులాంలు.  కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే…ప్ర‌తీ దానికి ఢిల్లీ వెళ్లాలి అని..టీఆర్ఎస్ కు ప్ర‌జ‌లే అథిష్టానం అని చెప్పారు. స్వ‌రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కాంగ్రెస్ నేత‌ల‌కు స‌త్తా లేక చంద్ర‌బాబును వెంట తెచ్చుకున్నారు. తెలంగాణ‌కు ఇంకా చంద్ర‌బాబు అవ‌స‌ర‌మా అని ప్ర‌శ్నించారు. వాళ్ల టిక్కెట్ల పంచాయితీ నిన్న‌టి వ‌ర‌కు తెగ లేదు. కాంగ్రెస్ నేత‌ల టిక్కెట్లు చంద్ర‌బాబు డిసైడ్ చేసే దౌర్భాగ్యం ఉంది. ఏపీలో చంద్ర‌బాబు ప‌రిపాల‌న స‌రిగా లేదన్నారు. ఏపీలో రుణ‌మాఫీ జ‌ర‌గ‌లేదు. తెలంగాణ‌లో పూర్తి చేసాం అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here