Home Political News తెలంగాణ‌ను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది – విజ‌య‌శాంతి

తెలంగాణ‌ను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది – విజ‌య‌శాంతి

87
0
vijayashanti_0

కేసీఆర్ నిజమాబాద్ బ‌హిరంగ స‌భ‌లో తెలుగుదేశం, కాంగ్రెస్ నాయ‌కుల పై విమ‌ర్శ‌లు చేయ‌డం తెలిసిందే. అయితే.. కేసీఆర్ చేసిన‌ విమ‌ర్శ‌ల పై కాంగ్రెస్ నాయ‌కులు ఘాటుగానే స్పందించారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డి స్పందిస్తూ…కేసీఆర్ కు అబ‌ద్దాలు ఆడ‌డం అల‌వాటే. మేమే నాలుగైదు సీట్లు ఇచ్చాం. నువ్వా మాకు సీట్లు ఇచ్చేది అని ప్ర‌శ్నించారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయం. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం గ‌జ దొంగ‌ల్లా దోచుకున్నార‌ని ఆరోపించారు.

హామీల‌ను నిల‌బెట్టుకోలేని వాళ్ల‌ను హైద‌రాబాద్ లో బ‌ట్టెబాజ్ అంటారు. మేం అధికారంలోకి వ‌చ్చాకా ఏక కాలంలో 2 ల‌క్ష‌ల రుణ మాఫీ చేస్తాం అని టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కేసీఆర్ లాంటి దొర‌ల‌ను త‌రిమికొట్టింది. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు భ‌య‌ప‌డం. తెలంగాణ‌ను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తే చూస్తూ ఊరుకోం. టీఆర్ఎస్ డ‌బ్బులిస్తే తీసుకుని కాంగ్రెస్ కు ఓటేయ్యండి అని కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here