Home Political News తెలంగాణ‌లో చంద్ర‌బాబు ప్ర‌చారం – తెలుగు త‌మ్ముళ్ల‌లో ఆనందం..!

తెలంగాణ‌లో చంద్ర‌బాబు ప్ర‌చారం – తెలుగు త‌మ్ముళ్ల‌లో ఆనందం..!

99
0

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మ‌రింత స్పీడుగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది. హైద‌రాబాద్ ఎన్టీఆర్ భ‌వ‌న్ లో పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర క‌మిటీ స‌భ్యుల‌తో చంద్ర‌బాబు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ…తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు తెలంగాణ‌లో ప్ర‌చారానికి వ‌స్తాన‌ని చెప్ప‌డంతో నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన ప్రచారంతో మహాకూటమి విజయావకాశాలు పెరుగుతాయని తెలుగుదేశం నేత‌లు తెలియ‌చేసారు.

ఇదిలా ఉంటే… గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీ ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పలువురు నేతలు చంద్రబాబును కలుసుకుని తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఎన్ని సీట్లు.. ఏ సీటు, ఏ అభ్యర్థి అనే మూడు దశల్లో జరుగుతుందని స్పష్టం చేశారు.వ్య‌తిరేకులు ఉండ‌కూడ‌దు అన్న‌ట్టు టీఆర్ఎస్ పార్టీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చంద్ర‌బాబుకు తెలియ‌చేసాం. బీజేపీ చెప్పుకోద‌గ్గ ఒక్క ఒక కార్య‌క్ర‌మం కూడా చేప‌ట్ట‌లేక‌పోయింది. జీఎస్టీ, నోట్ల ర‌ద్ధు నిర్ణ‌యాల‌తో ప్ర‌జ‌ల పై భారం మోపింది అన్నారు.

రాష్ట్రంలో తెదేపా ఇస్తున్న మ్యానిఫెస్టోని చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్లాం. మ‌హాకూట‌మి గెలుపే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని చంద్ర‌బాబు సూచించారు. చంద్ర‌బాబు స‌మావేశం తెదేపా శ్రేణుల్లో మ‌నోధైర్యాన్ని నింపింది అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here