Home News తెలంగాణ‌లో జనవరి 17న పంచాయతీ ఎన్నికలు..?

తెలంగాణ‌లో జనవరి 17న పంచాయతీ ఎన్నికలు..?

90
0

తెలంగాణ‌లో జ‌న‌వ‌రి 17న పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎన్నిక‌లు మూడు విడతలుగా జ‌ర‌గ‌నున్నాయి. రెండు రోజుల్లో రిజర్వేషన్ ఖరారు చేసి అధికారికంగా ప్రకటన చేయ‌నున్నార‌ని స‌మాచారం. 50% మహిళలకు రిజర్వేషన్ కేటాయించ‌నున్నారు. ఈ నెల 27న షెడ్యూల్ విడుదల చేసే అవ‌కాశం ఉంది.

జనవరి 3న తొలిదశకు నోటిఫికేషన్ విడుదల.

ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ.. 5న ఆఖరుతేది.6న స్ర్కూట్ని.. 7న ఉపసంహారణ..? జనవరి 17న మద్యాహ్నం1వరకు పోలింగ్..? 2గంటలకు కౌంటింగ్ ప్రారంభం..ఫలితాలు విడుదల.

జనవరి 7న రెండవ దశకు నోటిఫికేషన్.. ?

అదే రోజు నామినేషన్ల ప్రారంభం..9న ఆఖరు గడువు..10న స్ర్కూట్ని.. 11న ఉపసంహారణ..? జనవరి 21న మధ్యాహ్నం 1 వరకు పోలింగ్.. 2 గంటలకు కౌంటింగ్.. ఫలితాలు విడుదల..?

జనవరి 15న మూడవ దశకు నోటిఫికేషన్..?

అదేరోజు నామినేషన్ల ప్రక్రీయా షూరు..17న ఆఖరు గడువు..18న స్ర్కూట్ని..19న ఉపసంహారణ..జనవరి 27న పోలింగ్..? మధ్యాహ్నం1వరకు పోలింగ్.. మధ్యాహ్నం2గంటలకు కౌంటింగ్..ఫలితాలు విడుదల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here