Home Political News తెలంగాణ‌లో టీఆర్ఎస్ కి న‌ష్టం క‌లిగించే అంశాలు ప్ర‌క‌టించిన ల‌గ‌డ‌పాటి..!

తెలంగాణ‌లో టీఆర్ఎస్ కి న‌ష్టం క‌లిగించే అంశాలు ప్ర‌క‌టించిన ల‌గ‌డ‌పాటి..!

134
0

ల‌గ‌డ‌పాటి రాజ్ గోపాల్ ఎన్నిక‌ల ముందు స‌ర్వే చేయించ‌డం…ఆయ‌న ప్ర‌క‌టించిన న‌ర్వే ఫ‌లితాలు దాదాపు నిజం కావ‌డం తెలిసిందే. అందుక‌నే ఎన్నిక‌ల వ‌స్తున్నాయంటే రాజ‌కీయ ప్ర‌ముఖుల నుంచి సామాన్య జ‌నం వ‌ర‌కు అంద‌రూ ల‌గ‌డ‌పాటి స‌ర్వే కోసం ఎదురు చూస్తుంటారు. అయితే..ఇటీవ‌ల ల‌గ‌డ‌పాటి తెలంగాణ ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్ధులు 10 మంది గెలుస్తార‌ని చెప్ప‌డం తెలిసిందే. ఆత‌ర్వాత బీజేపీ గ‌తంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలుస్తుంద‌ని..ఖ‌మ్మం, న‌ల్గొండ‌, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్ర‌జాకూట‌మి ఆధిక్యంలో ఉంటుంద‌ని..క‌రీంన‌గ‌ర్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ మ‌ధ్య పోటాపోటీ ఉంటుంద‌ని చెప్పారు.

హైద‌రాబాద్ లో అత్య‌ధికంగా ఎంఐఎంకు మిగ‌తావి బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పంచుకుంటాయ‌న్నారు.  అయితే…ల‌గ‌డ‌పాటి స‌ర్వే ప్ర‌జాకూట‌మికి అనుకూలంగా ఉంది. దీంతో టీఆర్ఎస్ నాయ‌కుడు కేటీఆర్ స్పందిస్తూ…న‌వంబ‌ర్ లో ల‌గ‌డ‌పాటి టీఆర్ఎస్ 65 నుంచి 70 సీట్లు గెలుస్తుంద‌ని మెసేజ్ పంపించార‌ని తెలియ‌చేస్తూ…ఆ మెసేజ్ ను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసారు.

ఈరోజు ల‌గ‌డ‌పాటి మీడియా ముందుకు వ‌చ్చి కేటీఆర్ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. ప్ర‌తిప‌క్షాలు ఏక‌మ‌వ్వ‌డం వ‌ల‌న ప‌రిస్థితి పూర్తిగా మారింద‌ని చెప్పారు. తెలంగాణలో చంద్రబాబు, కోదండరాం, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు ఏకం కావడంతో ప‌రిస్థితి మారింద‌ని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమిని ఇవ్వలేదన్న విషయంలో ఆ సామాజివకర్గం ఏకమయిందనీ, టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందని తెలిపారు.

ఆదివాసీలకు(ఎస్టీ) 12 శాతం రిజర్వేషన్ హామీ నిలబెట్టుకోకపోవడంతో వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో ఎస్టీ సామాజికవర్గం మొత్తం మహాకూటమి వైపు మొగ్గు చూపుతోందని వెల్లడించారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకపోవడంతో పట్టణాల్లో టీఆర్ఎస్ కు తీవ్రమైన వ్యతిరేకత వస్తోందన్నారు. 7వ తేదీ సాయంత్రం త‌న స‌ర్వే పూర్తి వివ‌రాలు తెలియ‌చేస్తాన‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here