Home Political News తెలంగాణ‌లో టీఆర్ఎస్ కుటుంబ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడ‌తాం – ఏపీ మంత్రి సోమిరెడ్డి.

తెలంగాణ‌లో టీఆర్ఎస్ కుటుంబ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడ‌తాం – ఏపీ మంత్రి సోమిరెడ్డి.

98
0

క‌ర్ణాటకలో బీజేపీకి ప్రజలు షాక్ ఇచ్చారని, కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి ప్రజలు మద్దతు పలికారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ…క‌ర్నాట‌క ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ – జేడీఎస్ కూట‌మి విజ‌యం సాధించింది.బీజేపీకి ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు త‌గిన బుద్ధి చెప్పారు.క‌ర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు, దేశంలో జరుగుతున్న పరిణామాలకు అద్దం పడుతున్నాయని అన్నారు.జాతీయ స్ధాయిలో మ‌హాకూట‌మి తొలి గెలుపు ఇది అని తెలియ‌చేసారు.

మోడీ నిరంకుశ పాల‌న‌ను ప్ర‌జ‌ల వ్య‌తిరేకిస్తున్నారు అన‌డానికి ఇదే నిద‌ర్శ‌నం. 2019 ఎన్నిక‌ల్లో కూడా ఇదే ఫలితం రాబోతుంది అని చెప్పారు. శివ‌మొగ్గ‌లో య‌డ్యూర‌ప్ప కుమారుడు కోట్లు ఖ‌ర్చు చేసాడు. మోడీని గ‌ద్దె దించే వ‌ర‌కు మ‌హాకూట‌మి విశ్ర‌మించ‌దు. తెలంగాణ‌లో టీఆర్ఎస్ కుటుంబ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడుతాం అన్నారు. ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ ఏం చేసారో చెప్పుకోలేక‌నే చంద్ర‌బాబు పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో మహాకూటమి విజయం ఖాయం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here