Home Political News తెలంగాణ‌లో టీడీపీ క్యాడ‌ర్ బ‌లంగా ఉంది – చంద్ర‌బాబు

తెలంగాణ‌లో టీడీపీ క్యాడ‌ర్ బ‌లంగా ఉంది – చంద్ర‌బాబు

91
0
N.-Chandrababu-Naidu

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ క్యాడ‌ర్ బ‌లంగా ఉంద‌ని తెలియ‌చేసారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. ఈరోజు బాబు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో జాతీయ రాజ‌కీయాల పై చ‌ర్చించారు. మోదీకి ద‌గ్గ‌ర‌గా ఉన్న ఇత‌ర పార్టీల సీఎంలు ఎవ‌రున్నార‌నే అంశం పై కూడా చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. కేసీఆర్ బీజేపీకి  దగ్గరవుతున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కేసీఆర్‌ ఫినిష్ చెయ్యాలని చూశారని పేర్కొన్నారు.

రాజకీయాల్లో వాళ్లు ఎలా ఎదగాలో చూడకుండా.. మనల్ని అడ్డుకోవడం కోసమే కొందరు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పవన్, జగన్ వైఖరిని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు. ఎక్కడ వ్యక్తిగత విమర్శలు లేకుండా ప్రతిపక్షాలకు బదులివ్వాలని తెలిపారు. గెలవరని తెలిసి 2014లో బీజేపీకి 14 అసెంబ్లీ సీట్లు ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here