Home Political News తెలంగాణ‌లో నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌చారం ప్రారంభం..!

తెలంగాణ‌లో నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌చారం ప్రారంభం..!

106
0
balakrishna_2257

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు రావ‌డంతో ఎన్నికల వేడి రోజురోజుకు మ‌రింత పెరుగుతుంది. ఓ వైపు టీఆర్ఎస్ మ‌రో వైపు మ‌హా కూట‌మి గెలుపు కోసం ఎవ‌రి వ్యూహాల్లో వారు ఉన్నారు. మ‌హా కూట‌మిలో ఇంకా సీట్ల స‌ర్ధుబాటు జ‌ర‌గ‌లేదు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సీటు కోసం కాంగ్రెస్, తెలుగుదేశం రెండు పార్టీలు ప‌ట్టుబ‌డుతుండ‌డంతో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే..స్ప‌ష్ట‌త వ‌చ్చిన కొన్ని సీట్ల‌లో ఆయా నాయ‌కులు ప్ర‌చారం ప్రారంభిస్తున్నారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే…తెలంగాణ‌లోని ఖ‌మ్మంలో నంద‌మూరి బాల‌కృష్ణ ఈరోజు ప్ర‌చారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా బాల‌య్య‌కు టీడీపీ నేత‌లు నామా నాగేశ్వ‌ర‌రావు, సండ్ర వెంక‌ట వీర‌య్య త‌దిత‌రులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మ‌ధిర‌, స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్టీఆర్ విగ్ర‌హాల‌ను బాల‌కృష్ణ ఆవిష్క‌రించారు. దాదాపు 45 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించి, టీడీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు సాయంత్రం స‌త్తుప‌ల్లిలో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో బాల‌య్య పాల్గొని తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య త‌రుపున ప్ర‌చారం చేయ‌నున్నారు. మ‌రి..బాల‌య్య ప్ర‌చారం ఎంత వ‌ర‌కు క‌లిసొస్తుందో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here