Home Political News తెలంగాణ‌లో ప్ర‌శాంతంగా ముగిసిన ఎన్నిక‌లు. పోలింగ్ శాతం ఎంత‌..?

తెలంగాణ‌లో ప్ర‌శాంతంగా ముగిసిన ఎన్నిక‌లు. పోలింగ్ శాతం ఎంత‌..?

89
0

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 119 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటుహక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 56.17శాతం న‌మోదైన‌ పోలింగ్… స‌మ‌యం ముగిసే స‌మ‌యానికి 68.5 శాతం న‌మోదైన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో తొలుత పోలింగ్‌ ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఆ తర్వాత క్రమంగా పుంజుకొంది.

తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు పోలింగ్ జర‌గ‌గా.. 1821 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1.90 లక్షల మంది భద్రతా సిబ్బంది పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. టీఆర్ఎస్, ప్రజాకూటమి అధికారం కోసం తలపడుతున్నాయి. మరోవైపు భాజపా, బీఎల్‌ఎఫ్‌, ఎంఐఎం సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్వల్ప ఘటనల మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మ‌రి..ఓట‌ర్లు ఏ తీర్పు ఇచ్చారు అనేది ఈ నెల 11న తెలియ‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here