Home News తెలంగాణ‌లో ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా ఉంది – ఏఐసీసీ కార్యదర్శి శ్రీ సంపత్ కుమార్.

తెలంగాణ‌లో ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా ఉంది – ఏఐసీసీ కార్యదర్శి శ్రీ సంపత్ కుమార్.

87
0

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవ‌డం…దీనికి కార‌ణం టీఆర్ఎస్ ఈవీఎం టాంప‌రింగ్ వ‌ల్లే గెలిచింద‌ని క్రాంగెస్ నాయ‌కులు ఆరోపించ‌డం తెలిసిందే. ఈ రోజు గాంధీ భ‌వ‌న్ లో ఏఐసీసీ కార్యదర్శి శ్రీ సంపత్ కుమార్ మాట్లాడుతూ…తెలంగాణలో పరిస్థితి గందరగోళంగా ఉంది. ప్రభుత్వం ఏర్పడి 15 రోజులు అయింది కానీ…ఇంత వరకు మంత్రి వర్గ విస్తరణ జ‌ర‌గ‌లేదు. అసెంబ్లీలో ఎమ్యెల్యేల ప్రమాణ స్వీకారం జ‌ర‌గ‌ లేదు. తెలంగాణతో పాటు ఎన్నికైన మిగతా 4 రాష్ట్రాలలో అన్ని ఏర్పాటు అయ్యాయి.  ఇక్కడ మాత్రం ఏమీ జ‌ర‌గ‌లేద‌న్నారు. 

ఈవీఎం టాంపరింగ్ వల్ల టిఆర్ఎస్ గెలిచింది.ఇది ప్రజల గెలుపు కాదు, ఈవీఎంల గెలుపు అని మేము ముందుగానే చెప్పాం అన్నారు. ఇది నిజమని మేము ఆధారాలు చూపుతాం అంటే టీఆర్ఎస్ ముందుకు రాలేదు. కేటీఆర్ లై డిటెక్టర్ పరిశీల‌న‌కు రమ్మని అడిగితే వెనుకడుగు వేసాడు. మౌనం అంగీకరమే కదా అన్నారు. ముఖ్యమంత్రి పాలన వదిలేసి, తెలంగాణ ప్రజలను పక్కన పడేసి ఢిల్లీలో ఫ్రంట్ అంటూ తిరుగుతున్నారు అని విమ‌ర్శించారు.

తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి గుళ్ళు గోపురాలు తిరుగుతూ కాలం వెళ్లదీస్తున్నాడు. టాంపరింగ్ ల రాబందుల సమితిగా టీఆర్ఎస్ మారిపోయింది. కేసీఆర్ ఢిల్లీలో తిరుతుంటే కేటీఆర్ దుబాయిలో విలసాలు చేస్తున్నాడు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఊళ్ళల్లో మిగిలిన మందుతో ఎంజాయ్ చేస్తున్నారు.హరీష్ రావు తనకు మంత్రి పదవి రాదేమోనని భయవుడుతూ ఇంటికే పరిమితం అయ్యాడు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here