Home Political News తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను బొంద‌పెడ‌తామ‌న‌డం దారుణం – కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్..!

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను బొంద‌పెడ‌తామ‌న‌డం దారుణం – కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్..!

94
0

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల తేదీ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి రాజ‌కీయ పార్టీలు ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసాయి. టీఆర్ఎస్ పార్టీకి దీటుగా కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారం చేస్తుండ‌డంతో రాజ‌కీయ వాతావ‌ర‌ణం రోజురోజుకు వేడెక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారంలో భాగంగా సీనియ‌ర్ నేత వీహెచ్ మాట్లాడుతూ…టీఆర్ఎస్ పార్టీ పై మండిప‌డ్డారు. తెలంగాణ వ‌స్తే బ‌తుకులు బాగుప‌డ‌తాయ‌ని అంద‌రూ ఆశించారు. ఉద్యోగాలు వ‌స్తాయ‌ని ఆశించిన నిరుద్యోగుల ఆశ నెర‌వేర‌లేదు అన్నారు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను బొంద‌పెడ‌తామ‌న‌డం దారుణం. కాంగ్రెస్ ప‌ట్ల విశ్వాసం చూప‌ని కేసీఆర్ ను ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నారు. తెరాస మీద అస‌హ్యంతో చాలా మంది కాంగ్రెస్ లోకి వ‌స్తున్నారు. విజ‌యావ‌కాశాలు ఎక్కువుగా ఉన్న‌వారికే టిక్కెట్ ఇవ్వాలి. కాకా కుటుంబానికి పార్టీలో అన్ని ప‌ద‌వులు ఇచ్చాం. ఇప్పుడు వినోద్ మ‌ళ్లీ కాంగ్రెస్ లోకి వ‌స్తార‌ట‌. ఇష్టం వ‌చ్చిన‌ప్పుడు రావ‌డం, పోవ‌డం మంచి ప‌ద్ద‌తి కాదు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here