Home Political News తెలంగాణ ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదే..!

తెలంగాణ ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదే..!

105
0

దేశ రాజధానిలో ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించింది. ఈ స‌మావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ మాట్లాడుతూ.. తెలంగాణ లో డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహిస్తామని…అనంతరం డిసెంబర్ 11న ఫలితాలను ప్రకటిస్తామని తెలియ‌చేసారు. ఓటర్ల జాబితా పై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉందని… ఓటర్ల తుది జాబితాను ఈ నెల 8న ప్రకటించాల్సి ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఓటర్ల జాబితాను ఈనెల‌ 12న ప్రకటిస్తామన్నారు.

వచ్చే నెల 12న నోటిఫికేషన్ జారీచేస్తామని… నవంబర్ 19 వరకూ నామినేషన్లను దాఖలు చేసుకోవచ్చని, ఆత‌ర్వాత 20 వ‌ర‌కు నామినేష‌న్ల‌ ప‌రిశీల‌న ఉంటుంద‌ని…ఇక న‌వంబ‌ర్ 22 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని వెల్లడించారు. సాధారణంగా అసెంబ్లీ రద్దయిన 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణతో పాటు రాజస్తాన్ కు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here