Home Political News తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు..!

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు..!

107
0
Revanth-Reddy-1

తెలంగాణ కాంగ్రెస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసాల్లో ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల నుంచి ప‌దుల సంఖ్య‌లో ఐటీ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సోదాలు చేసారు. రేవంత్ రెడ్డి బంధువులు ఇళ్ల‌లోను ఐటీ త‌నిఖీలు చేసారు. సోదాల స‌మ‌యంలో రేవంత్ రెడ్డి, అత‌ని కుటుంబ స‌భ్యులు ఇంట్లో లేరు. రేవంత్ రెడ్డికి చెందిన ప‌లు ప్రాంతాల్లో 15 బృందాల‌తో త‌నిఖీలు చేసారు.

రేవంత్ రెడ్డికి చెందిన వ్యాపార సంస్థ‌ల కార్యాల‌యాల్లోను త‌నిఖీలు చేసారు. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే కాంగ్రెస్ నేత‌లు వేం న‌రేంద‌ర్ రెడ్డి, సీత‌క్క రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. రేవంత్ ఇంటి వద్దకు వచ్చిన ఐటీ అధికారులు తలుపు తీయాలని పని మనుషులను అడిగారు. సార్ ఇంట్లో లేరు. ఆయనకు ఫోన్ చేయండి అని పని మనుషులు చెప్పార‌ట‌. అయితే…అధికారులు మాత్రం ఇంటి తలుపులు పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నా… ఏమేం గుర్తించారో ఇంకా తెలియరాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here