Home Political News తెలంగాణ తెలుగుదేశం పార్టీలో పొత్తుల చిచ్చు – బాబు వ‌ద్ద‌కు చేరిన పంచాయితీ..!

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో పొత్తుల చిచ్చు – బాబు వ‌ద్ద‌కు చేరిన పంచాయితీ..!

104
0
chandhra babu

తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, కోదండరామ్ పార్టీ క‌లిసి మ‌హా కూట‌మిగా ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ కూట‌మిలో సీట్ట స‌ర్ధుబాటు విష‌య‌మై గ‌త కొన్ని రోజులుగా చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి కానీ..ఇంకా క్లారిటీ రాలేదు. అయితే.. తెలుగుదేశం పార్టీలో పొత్తుల సమస్య తలెత్తింది. దీంతో సీట్ల పంచాయితీ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వద్దకు చేరిందని స‌మాచారం. నర్సంపేట స్థానం పై కూటమిలో ప్రతిష్టంభన నెలకొంది.

ఆ స్థానం టీడీపీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరిస్తోంది. దీంతో కాంగ్రెస్ తీరు పై రేవూరి ప్రకాష్‌రెడ్డి గుర్రు మంటున్నారు. ఈ అంశం పై చంద్రబాబును కలిసేందుకు ఆయన అమరావతికి వెళ్లారు. ఒకవేల పొత్తుల సందర్భంగా టీడీపీ నర్సంపేటను వదులుకుంటే… తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే యోచనలో రేవూరి ప్రకాష్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. మ‌రి…చంద్ర‌బాబు ఈ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్కరిస్తారో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here