Home Political News తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లే టీఆర్ఎస్ మ్యానిఫెస్టో – రాష్ట్ర మంత్రి హ‌రీష్ రావు..!

తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లే టీఆర్ఎస్ మ్యానిఫెస్టో – రాష్ట్ర మంత్రి హ‌రీష్ రావు..!

90
0

తెలంగాణ‌లో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో రాజ‌కీయ పార్టీలు ప్ర‌చారంలో స్పీడు పెంచాయి. ఓట‌ర్లను త‌మ వైపుకు తిప్పుకునేందుకు ఎవ‌రి శైలిలో వారు ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి హ‌రీష్ రావు టీఆర్ఎస్ పార్టీ ప్ర‌చారంలో భాగంగా మాట్లాడుతూ…ఆంధ్రుల‌తో కాదు. వ‌ల‌సాంధ్ర నాయకుల‌తోనే మా పంచాయితీ అని చెప్పారు. తెలంగాణ ప్ర‌జ‌ల పై ఇక్క‌డి నాయ‌క‌త్వ‌మే నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు.

టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ ఎవ‌రి క‌నుస‌న్న‌ల్లో ప‌ని చేస్తున్నాడు అని ప్ర‌శ్నించారు. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఢిల్లీ ఏపీ భ‌వ‌న్ లో చంద్ర‌బాబు ముందు చేతులు క‌ట్టుకుని నిల‌బ‌డ‌టం తెలంగాణ ప్ర‌జ‌ల‌ను బాధించింది అన్నారు. ఒకరిది రెండుకళ్ల సిద్ధాంతం అయితే, మరొకరిది కన్నుకొట్టుడు సిద్ధాంతం అని విమర్శించారు. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లే మ్యానిఫెస్టో అని తెలియ‌చేసారు. టీఆర్ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని రైతులు నమ్ముతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here