Home Political News తెలుగుదేశం పార్టీ ఎన్నిక‌ల ప్ర‌ణాళిక.!

తెలుగుదేశం పార్టీ ఎన్నిక‌ల ప్ర‌ణాళిక.!

103
0

అమ‌రవీరుల కుటుంబాల సంక్షేమం..!

తెలంగాణ‌లో ఎన్నిక‌ల నేప‌ధ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టించింది. ఇందులో అమ‌ర‌వీరుల కుటుంబాల‌ సంక్షేమం కోసం ఏం చేయ‌నున్నారో తెలియ‌చేసారు. తెలంగాణ ఉద్య‌మంలో 1200 మంది అమ‌ర‌వీరులయ్యారు. వారి త్యాగాల‌ను చ‌రిత్ర మ‌రువ‌లేదు. వారి త్యాగాల పునాదుల పైనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జ‌ర‌గ‌లేదు. అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ఎంత చేసినా అతి త‌క్కువే. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ఈ క్రింద హామీలు ఇవ్వ‌డం జరుగుతున్న‌ది.

ప్ర‌ధాన హ‌మీలు

* అమ‌ర‌వీరుల స్మృతి చిహ్నం ఏర్పాటు

* అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ఇండ్లు ఇవ్వ‌డం జ‌రుగుతుంది.

* అమ‌ర‌వీరుల ప్ర‌తి కుటుంబానికి 3 ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి

* రూ 10 ల‌క్ష‌ల ఆర్ధిక స‌హాయం

* కుటుంబంలో ఒకరికి ప్ర‌భుత్వ ఉద్యోగం

* ఉద్య‌మ‌కారుల పై కేసులు ఎత్తివేత‌

* తెలంగాణ ఉద్య‌మ చ‌రిత్ర‌కు సంబంధించిన ఘ‌ట్టాల‌ను పాఠ్యాంశాలుగా భోద‌న‌

తెలంగాణ ఉద్య‌మ పితామ‌హుల‌కు గౌర‌వం

తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవ‌స‌రాన్ని త‌మ ర‌చ‌న‌లు, క‌విత్వం వివిధ క‌ళారూపాలు, ఉద్య‌మాల ద్వారా యావ‌త్ ప్ర‌పంచానికి చాటి చెప్పి తెలంగాణ అస్ధిత్వాన్ని కాపాడ‌ట‌మే కాకుండా తెలంగాణ ప్ర‌జ‌ల ఆశ‌, శ్వాస‌గా మార్చిన ఎంద‌రో మ‌హ‌నీయులు ఉన్నారు. వారిని గౌర‌వించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అటువంటి మ‌హనీయుల స్మృతుల‌ను స‌జీవ‌ప‌ర‌చుకోవ‌డానికి వారి పేరిట వివిధ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌డం జ‌రుగుతోంది.

ప్ర‌ధాన హ‌మీలు

* ఐల‌మ్మ పేరిట మ‌హిళా సాధికార‌త కార్య‌క్ర‌మాలు

* డా. కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ పేరిట శిక్ష‌ణ కేంద్రం

* ఆచార్య జ‌య‌శంక‌ర్ పేరిట ప్ర‌తిష్టాత్మ‌క విద్యా సంస్థ‌లు వారి పేరిట విద్యా ప్రొత్స‌హల‌కు చ‌ర్య‌లు

* కాళోజీ నారాయ‌ణ‌రావు, దాశ‌ర‌ధి రంగాచార్య పేరిట సాహిత్య పుర‌స్కారాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here