Home Actor తెలుగులో సినిమా చేస్తోన్న‌ కె.జి.ఎఫ్ డైరెక్ట‌ర్..ఇంత‌కీ హీరో ఎవ‌రు..?

తెలుగులో సినిమా చేస్తోన్న‌ కె.జి.ఎఫ్ డైరెక్ట‌ర్..ఇంత‌కీ హీరో ఎవ‌రు..?

116
0

కె.జి.య‌ఫ్ సినిమాతో క‌న్న‌డ చిత్రసీమ‌లోనే కాకుండా  తెలుగు, త‌మిళ్, హిందీలో కూడా సెన్సేష‌నల్ హిట్ సాధించిన డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌. ఈ చిత్రంలో య‌ష్ హీరోగా న‌టించాడు. ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ పార్ట్ షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే…కె.జి.య‌ఫ్ సినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ హీరోలు ఇంట్ర‌స్ట్ చూపించారు. 

అయితే…తెలుగులో ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడు అనేది అఫిషియ‌ల్ గా ఎనౌన్స చేయ‌లేదు. ఈ రోజు ప్ర‌శాంత్‌నీల్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఈ విష‌యం పై కాస్త క్లారిటీ వ‌చ్చింది. మ్యాట‌ర్ ఏంటంటే…తెలుగులో ప్ర‌స్తుతం ప్ర‌ముఖ నిర్మాణ సంస్థల్లో ఒక‌టైన మైత్రీ మూవీ మేక‌ర్స్ మా ద‌ర్శ‌కుడికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంటూ  ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. అంటే ప్ర‌శాంత్ నీల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ సినిమా చేయ‌నున్న‌ట్టు చెప్ప‌క‌నే చెప్పింది.

ఈ సినిమాలో హీరో ఎవ‌రు అనేది మాత్రం క్లారిటీ రాలేదు కానీ…యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పేరు ఎక్కువుగా వినిపిస్తోంది. ప్ర‌చారంలో ఉన్న‌ట్టుగా ఎన్టీఆర్ తో చేస్తారా..?  లేక‌ మ‌హేష్, ప్ర‌భాస్, రాంచ‌ర‌ణ్‌ల‌లో ఎవ‌రో ఒక‌రితో చేస్తారా అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here