Home Actor తెలుగు వారి ఆరాధ్య దైవంకు 9 కోట్లు, డిజాస్ట‌ర్ మూవీకి 30 కోట్లా..?

తెలుగు వారి ఆరాధ్య దైవంకు 9 కోట్లు, డిజాస్ట‌ర్ మూవీకి 30 కోట్లా..?

112
0

తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు వారి ఆత్మ గౌర‌వాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా చాటి చెప్పిన మ‌హానీయుడు నంద‌మూరి తార‌క రామారావు. ఆయ‌న జీవిత చ‌రిత్ర ఆధారంగా రూపొందిన సంచ‌ల‌న చిత్రం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు. వైవిధ్య‌మైన చిత్రాల‌ను అద్భుతంగా తెర‌కెక్కించే జాగ‌ర్ల‌మూడి క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ఎన్టీఆర్ పాత్ర‌లో న‌టించ‌డంతో పాటు నిర్మించ‌డం విశేషం. భారీ తారాగ‌ణంతో.. ఎన్నో అంచ‌నాల‌తో…రిలీజైన ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు చిత్రం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. 

అయితే…ఈ చిత్రానికి ఆశించిన స్ధాయిలో క‌లెక్ష‌న్స్ లేవు అని తెలిసింది. తెలుగు వారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర కావ‌డం..క్రిష్ డైరెక్ట‌ర్ కావ‌డం..భారీ తారాగ‌ణం.. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచి హిట్ టాక్ రావ‌డం..ఇన్నీ క‌లిసొచ్చే అంశాలు ఉన్న‌ప్ప‌టికీ క‌లెక్ష‌న్స్ మాత్రం ఊహించిన స్ధాయిలో లేవు. మూడు రోజుల‌కు ఈ సినిమా 9 కోట్ల షేర్ రాబ‌ట్టింది. మ‌రో వైపు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి కాంబినేష‌న్ లో రూపొందిన విన‌య విధేయ రామ సినిమా ఈ నెల 11న రిలీజైంది.

ఈ సినిమాకి ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచి డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ ఈ సినిమాకి ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లో 20.09 కోట్ల షేర్ వ‌చ్చింది. క‌ర్నాట‌క‌లో 4.01 కోట్లు, ఆర్ఓఐ 45 ల‌క్ష‌లు టోట‌ల్ గా ఇండియాలో విన‌య విధేయ రామ చిత్రానికి 30.64 కోట్ల షేర్ వ‌చ్చింది. మాస్ హీరోగా చరణ్ కి విపరీతమైన ఫాలోయింగ్ వుండ‌డం… ఇక యాక్షన్ తో పాటు ఎమోషన్ ను అద్భుతంగా ఆవిష్కరించే బోయ‌పాటి ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు కావ‌డం.. ఈ కారణంగానే ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్ల వ‌చ్చాయ‌ని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా తెలుగు వారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర సినిమాగా తెర పైకి వ‌స్తే..క‌లెక్ష‌న్స్ ఆశించిన స్ధాయిలో లేక‌పోవ‌డం బాధాక‌రం. మ‌రి..సంక్రాంతి కాబ‌ట్టి రేప‌టి నుంచి క‌లెక్ష‌న్స్ పెరుగుతాయ‌ని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here