Home Actor తేజు..ఆ ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో సినిమా చేయ‌నున్నాడా..?

తేజు..ఆ ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో సినిమా చేయ‌నున్నాడా..?

61
0
తేజు..ఆ ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో సినిమా చేయ‌నున్నాడా..? spiceandhra

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ చిత్ర‌ల‌హ‌రి సినిమాతో ఫ‌ర‌వాలేద‌నిపించినా…ఆశించిన స్ధాయిలో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయాడు. ఈసారి పూర్తి స్ధాయిలో ఆక‌ట్టుకునేందుకు యువ ద‌ర్శ‌కుడు మారుతితో సినిమా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. యు.వి. క్రియేష‌న్స్ నిర్మించే ఈ సినిమా త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే…తేజు ఓ ప్లాప్ డైరెక్ట‌ర్ తో సినిమా చేయ‌నున్నాడు అంటూ ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఆ ప్లాప్ డైరెక్ట‌ర్ ఎవ‌రంటారా..?  వెన్నెల‌,  ప్ర‌స్ధానం సినిమాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ దేవ క‌ట్టా. ప్ర‌స్ధానం త‌ర్వాత ఆటోన‌గ‌ర్ సూర్య‌, డైన‌మేట్ చిత్రాల‌ను తెర‌కెక్కించినప్ప‌టికీ మెప్పించ‌లేక‌పోయాయి. దీంతో కెరీర్ లో చాలా గ్యాప్ వ‌చ్చింది.

ఇటీవ‌ల తేజుకు..దేవ క‌ట్టా ఓ స్టోరీ లైన్ వినిపించార‌ట‌. క‌థ న‌చ్చ‌డంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయ్ మ‌ని చెప్పార‌ట‌. ప్ర‌స్తుతం దేవ అదే ప‌నిలో ఉన్నార‌ట‌. సీరియ‌స్ మోడ్ లో ఉండే యాక్ష‌న్ డ్రామాగా ఈ సినిమా ఉంటుంద‌ట‌. మ‌రి.. ఫుల్ స్క్రిప్ట్ తో మెప్పిస్తాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here