Home Actor తేజ్.. గ్లాస్ మేట్స్ సాంగ్ సూప‌ర్..!

తేజ్.. గ్లాస్ మేట్స్ సాంగ్ సూప‌ర్..!

108
0


మెగాస్టార్ మేన‌ల్లుడు సాయి తేజ్ హీరోగా నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్నచిత్రం చిత్రలహరి. ఈ చిత్రంలో సాయి తేజు స‌ర‌స‌న‌ కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ న‌టించారు. ఈ వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.

ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఈ మూవీ టీజ‌ర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే ఇటీవల విడుదలైన పరుగు పరుగు పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాలోనే సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేసారు. గ్లాస్‌మేట్సూ..గ్గాస్ మేట్సూ… అంటూ సాగే ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, పెంచల్ దాస్, దేవీశ్రీ ఆల‌పించారు. ఈ పాట‌కు చంద్రబోస్ అందించిన సాహిత్యం చాలా సింపుల్‌గా అద్భుతంగా ఉండ‌డంతో విన్న వెంట‌నే ఇట్టే కనెక్ట్ అయిపోతుంది.

ఈ సాంగ్ కు స్టెప్పులేయని మ్యూజిక్ లవర్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ మూవీ టీజ‌ర్ & సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావ‌డంతో సినిమా పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయ‌ని చెప్ప‌చ్చు. మ‌రి..ఎప్ప‌టి నుంచో స‌క్స‌స్ కోసం ఎదురు చూస్తోన్న సాయి తేజ్ కి ఈ సినిమా ఆశించిన విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here