Home Actor త్రివిక్ర‌మ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మ‌రి…త్రివిక్ర‌మ్ ఎవ‌రికి ఫ్యానో తెలుసా..?

త్రివిక్ర‌మ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మ‌రి…త్రివిక్ర‌మ్ ఎవ‌రికి ఫ్యానో తెలుసా..?

138
0

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నార‌నే విష‌యం తెలిసిందే. అయితే…త్రివిక్ర‌మ్ ఎవ‌రికి ఫ్యాన్..? ఈ విష‌యాన్ని అల్లు శిరీష్ న‌టించిన ఏబీసీడీ మూవీ ట్రైలర్ ను రిలీజ్ వేడుక‌లో బ‌య‌ట పెట్టారు. ఈ వేడుక‌కు ముఖ్య అతిధిగా వ‌చ్చిన‌ త్రివిక్ర‌మ్ మాట్లాడుతూ…జల్సా టైంలో శిరీష్‌ను చిన్న కుర్రాడిగా చూశాను. నాకు తెలిసి సినిమాల పై అండర్‌స్టాండింగ్‌ ఉన్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో శిరీష్‌ కూడా ఒకరు. సినిమాను అర్థం చేసుకుని ప్రేమించే వ్యక్తి తను.

తను ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సినిమాను ప్రేమించే వాళ్లు ఎక్కువ సినిమాలు చేయడం వల్ల మంచి సినిమాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమా ట్రైలర్‌ బాగా నచ్చింది. ఇద్దరు డబ్బున్నవాళ్లు వచ్చి కష్టాలు పడితే, మనకు చూడటానికి బాగా అనిపిస్తుంది. ఇందులో అల్లు శిరీష్ కి ఫ్రెండ్ గా న‌టించిన భరత్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. తను నటించిన వెంకీ, రెఢీ.. సినిమాల్లో తన క్యారెక్టర్‌ని బాగా ఎంజాయ్‌ చేశాను. ముఖ్యంగా భ‌ర‌త్ పోషించిన చిట్టి నాయుడు నాకు చాలా బాగా న‌చ్చింది. తనను ఇలా చూడటం నాకు ఫ్యాన్‌ మూమెంట్‌లా అపిస్తుంది అంటూ అస‌లు విష‌యం బ‌య‌ట పెట్టారు త్రివిక్ర‌మ్. అదీ…సంగ‌తి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here