Home Actor త్వ‌ర‌లో ఎఫ్ 3 మూవీ – అనిల్ రావిపూడి..!

త్వ‌ర‌లో ఎఫ్ 3 మూవీ – అనిల్ రావిపూడి..!

88
0

విక్ట‌రీ వెంక‌టేష్ – మెగా హీరో వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్ లో రూపొందిన చిత్రం ఎఫ్ 2. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఎఫ్ 2 చిత్రం సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. నిర్మాత దిల్ రాజుకు లాభాలు అందించింది. ఈ సంద‌ర్భంగా ఎఫ్ 2 గ్రాండ్ స‌క్సస్ మీట్ ను హైద‌రాబాద్ లో నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ… వరసగా ఎస్.వి.సి బ్యానర్ లో 3 సినిమాలు చేసే అవకాశం ఇచ్చి ఒకే బ్యానర్లో హ్యాట్రిక్ కొట్టడానికి కారణం అయిన దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ గార్లకు థాంక్స్.

 వెంకటేష్ గారి ఎనర్జీ ఎంతో ఈ సినిమాలో అందరూ చూశారు. థ్యాంక్యూ వెంకటేష్ గారు.. నన్ను నమ్మినందుకు. టీజర్ ద‌గ్గ‌ర‌ నుండి మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ సూపర్ స్టార్ మహేష్ గారు వేసిన ట్వీట్స్ చాలా కిక్ ని ఇచ్చాయి. సినిమా చూశాక కూడా ట్వీట్ చేసి  ఈ విజయాన్ని మనఃస్ఫూర్తిగా ప్రోత్సహించిన మహేష్ గారికి మా యూనిట్ తరఫున స్పెషల్ థాంక్స్. త్వరలో ఎఫ్ 3 మూవీ చేయ‌నున్నాను. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ కన్ఫర్మ్. మిగిలిన డీటైల్స్ అతి త్వరలో ఎనౌన్స్ చేస్తాం అన్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here