Home Actor త్వ‌ర‌లో వైభ‌వంగా “మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ – ఏపీ ఫిలిమ్ అవార్డ్స్‌”

త్వ‌ర‌లో వైభ‌వంగా “మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ – ఏపీ ఫిలిమ్ అవార్డ్స్‌”

85
0
త్వ‌ర‌లో వైభ‌వంగా

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ – ఏపీ స‌ర్వ స‌భ్య‌స‌మావేశం ఇటీవ‌ల‌ తెనాలిలో జ‌రిగింది.తొలుత ఈ కార్యక్రమంలో స్వర్గీయ శ్రీమతి విజయ నిర్మల కు నివాళులు అర్పించారు .అనంతరం  మా – ఏపీ 2018లో  ఉత్త‌మ చిత్రాల‌కు అవార్డులు ఇవ్వ‌నున్న‌ట్లు  మా సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు, ద‌ర్శ‌కుడు దిలీప్‌రాజా,  మా అసోసియేష‌న్ ప్రెసిడెంట్  సినీ న‌టి క‌విత తెలిపారు. ఎలాంటి జ్యూరీని నియ‌మించ‌కుండా తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లే న్యాయ‌మూర్తులుగా తీర్మానాన్ని ఆమోదించ‌నున్నారు.

 ప్ర‌జ‌ల తీర్పును క‌వ‌ర్‌లో మా ఏపీ కార్యాల‌యం, ఆల‌పాటి న‌గ‌ర్‌, సుల్తానాబాద్‌, తెనాలి-522201, గుంటూరు జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు పంప‌వ‌ల‌సిందిగా కోరారు. త‌మ‌పేరు, చిరునామా, ఆధార్ కార్డులుతో ప్ర‌జ‌లు త‌మ నిర్ణ‌యాన్ని పంప‌వ‌ల‌సిందిగా దిలీప్‌రాజా పేర్కొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణా రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జ‌లు  జులై 1 నుంచి  ఆగ‌స్టు 15, 2019 వ‌ర‌కు ఎంట్రీల‌ను పంప‌వ‌చ్చ‌ని అన్నారు. ఇందులో ఎలాంటి సిఫార‌సుల‌కు తావులేకుండా ప్ర‌జ‌లే నిజ‌మైన తీర్పును ఇవ్వ‌వ‌ల‌సిందిగా కోరారు.ప్ర‌జా నిర్ణ‌యాల్లో ఎవ‌రికి ఎక్కువ ఓట్లు వ‌స్తే వారిని మా. ఏపీ ఫిలిమ్ అవార్డుల‌కు ఎంపిక చేస్తామని తెలిపారు.

అలాగే స్వ‌ర్గీయ విజ‌య‌నిర్మ‌ల స్మార‌క అవార్డును ప్ర‌ముఖ ద‌ర్శ‌కులకుగాని, ప్ర‌ముఖ మ‌హిళా న‌టీమ‌ణికిగాని ఇవ్వ‌డం జ‌రుగుతుంది.  ఈ అవార్డు ఫంక్ష‌న్ త్వ‌ర‌లో తెనాలిలో వైభ‌వంగా జ‌ర‌గ‌నుంద‌ని  తెలిపారు. ప్ర‌జాతీర్పు అనంత‌రం తెలంగాణా, ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రాల సినిమాటోగ్ర‌ఫీ మంత్రుల‌ను ఈ వేడుక‌కు ఆహ్వానిస్తున్న‌ట్లుగా ద‌ర్శ‌కుడు దిలీప్‌రాజా, మా ఏపీ అధ్య‌క్షులు క‌విత చెప్పారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ ఆర్టిస్టులు,  మా అసోసియేష‌న్ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి న‌ర్సింహ‌రాజు, జ‌య‌శీల‌, మా అసోసియేష‌న్  నిర్వ‌హ‌ణ క‌మిటీ ఛైర్మ‌న్  బాసింశెట్టివీర‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here