Home Actor త‌మిళ‌, హిందీలో ఎఫ్ 2 – దిల్ రాజు.!

త‌మిళ‌, హిందీలో ఎఫ్ 2 – దిల్ రాజు.!

89
0

విక్ట‌రీ వెంక‌టేష్ – మెగా హీరో వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఎఫ్ 2 ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఎఫ్ 2 100 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇచ్చిన విజ‌యంతో అనిల్ రావిపూడి ఎఫ్ 3 కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే..ఎఫ్ 3 లో వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ ల‌తో పాటు మరో హీరో కూడా న‌టించ‌నున్నాడట‌.

ఆ హీరో ఎవ‌ర‌నేది త్వర‌లో తెలియ‌చేస్తామ‌ని..2021 సంక్రాంతికి ఈ ఎఫ్ 3 రిలీజ్ ప్లాన్ చేస్తున్న‌ట్టు నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఎఫ్ 2 చిత్రాన్ని త‌మిళ్, హిందీలో కూడా రీమేక్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఈ మూవీకి సంబంధించి అన్నీ రైట్స్ త‌న ద‌గ్గ‌రే ఉన్నాయ‌ని.. ముంబాయిలో రోజుకు ఇద్ద‌రు హీరోలు ఈ సినిమాని చూస్తున్నారని చెప్పారు. హిందీలో కూడా ఎఫ్ 2 రీమేక్ ని త‌నే నిర్మిస్తాన‌ని..అయితే.. వేరే సంస‌స్థ‌తో క‌లిసి నిర్మిస్తాన‌ని దిల్ రాజు అన్నారు. మ‌రి..తెలుగులో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఎఫ్ 2 త‌మిళ‌, హిందీలో ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here