రాజు గారి గది, రాజు గారి గది 2 చిత్రాలు ఇచ్చిన విజయోత్సాహంతో ఓంకార్ రాజు గారి గది 3 చిత్రాన్ని ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ హర్రర్ మూ వీలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుందిని ప్రకటించడం… తమన్నా ఈ మూవీ ప్రారంభోత్సవంకు రావడం కూడా జరిగింది. సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరింది. అయితే.. ఆతర్వాత రోజు నుంచే తమన్నా ఈ మూవీ నుంచి తప్పుకుంది అని వార్తలు వచ్చాయి.
కథలో.. తన పాత్రలో మార్పులు చేసారని..ఆ విషయం తమన్నాకి నచ్చకపోవడంతో తప్పుకుందని.. కొంత మంది అంటుంటే.. కాదు..బాలీవుడ్ లో ఆఫర్ వచ్చింది అందుకని తప్పుకుంది అని మరి కొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే… ఓంకార్ తమన్నా చేయాల్సిన పాత్ర కోసం తాప్సీని సంప్రదించారని టాక్ వచ్చింది.
తాప్సీ కథ విని ఏం చెప్పిందో బయటకు రాలేదు కానీ..తాజాగా కాజల్ పేరు వినిపిస్తోంది. ఇటీవల ఓంకార్ కాజల్ ని కలిసి కథ చెప్పారని…కథ నచ్చడంతో కాజల్ ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. మరి..ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమో కాదో ఓంకారే చెప్పాలి.