Home Actor త‌ల్లి పాత్ర చేసేందుకు ఓకే చెప్పిన స్టార్ హీరోయిన్..!

త‌ల్లి పాత్ర చేసేందుకు ఓకే చెప్పిన స్టార్ హీరోయిన్..!

62
0

త‌ల్లి పాత్ర చేసేందుకు ఓకే చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవ‌ర‌నుకుంటున్నారా..?  చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్..ఇలా సీనియ‌ర్ స్టార్ హీరోల‌తో పాటు ఈత‌రం అగ్ర హీరోలు మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, ప్ర‌భాస్, ఎన్టీఆర్ ల‌తో కూడా న‌టించి మెప్పించిన క‌థానాయిక శ్రియ‌. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన శ్రియ ఇప్పుడు సినిమాల‌పై ఫోకస్ పెట్టిన‌ట్టుంది. తెలుగులో ఓ సినిమాలో త‌ల్లి పాత్ర చేసేందుకు ఓకే చెప్పింద‌ట‌.

విభిన్న కథా చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి క‌థానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక కథను సిద్ధం చేసార‌ట‌. ఇటీవ‌ల శ్రియకు క‌థ‌ వినిపించి ఒప్పించాడని స‌మాచారం. ఈ సినిమాలో పదేళ్ల పాపకు తల్లిగా శ్రియ కనిపిస్తుందని చెబుతున్నారు. గతంలో శ్రియ గౌతమీపుత్ర శాతకర్ణి,  గోపాల గోపాల సినిమాల్లో తల్లి పాత్రల్లో మెప్పించింది. ఇప్పుడు మ‌రోసారి త‌ల్లి పాత్రలో న‌టించేందుకు ఓకే చెప్పింద‌ట‌. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్నినిర్మించ‌నుంది. ఇందులో హీరో ఎవ‌రు..? ఎప్పుడు ప్రారంభం అనేది తెలియాల్సివుంది..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here