Home Actor దండుపాళ్యం 4 విడుదల తేదీ ఖ‌రారు.

దండుపాళ్యం 4 విడుదల తేదీ ఖ‌రారు.

49
0
దండుపాళ్యం 4 విడుదల తేదీ ఖ‌రారు. spiceandhra

సుమన్‌ రంగనాథన్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, వెంకట్‌, సంజీవ్‌కుమార్‌, కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్‌ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’ చిత్రం అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు, నిర్మాత మీడియాతో   సమావేశం అయ్యారు.

ఈ సందర్బంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ… సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మా  సినిమాను ఖచ్చితంగా ఆగస్ట్ 15న విడుదల చెయ్యబోతున్నాము. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాల్లో ఉందీ సినిమా. ఈ ‘దండుపాళ్యం-4’లో జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ ‘దండుపాళ్యం 4’ ఉండబోతోంది. ఇందులో ఏడుమంది ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ చక్కగా నటించారు. కె.టి.నాయక్‌ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు’ అన్నారు.

దర్శకుడు కె.టి.నాయక్ మాట్లాడుతూ… దండుపాళ్యం1,2 పార్ట్స్ కు ఈ సినిమా ఎలాంటి సంబంధం లేదు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. ఆగస్ట్ 15న ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాను. బెనర్జీ, వెంకట్‌, ముమైత్‌ఖాన్‌, సంజీవ్‌కుమార్‌, సుమన్‌ రంగనాథన్‌ పాత్రకు సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయి’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here