Home Movie News దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చేతులమీదుగా”ప్రాణం ఖరీదు” థియేట్రికల్ ట్రైలర్ విడుదల

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చేతులమీదుగా”ప్రాణం ఖరీదు” థియేట్రికల్ ట్రైలర్ విడుదల

67
0

 ప్రశాంత్ అవంతిక  హీరోయిన్ గా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో యన్. ఎస్ క్రియేషన్స్ పతాకం పై పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మాతగా పి. ఎల్. కె . రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రాణం ఖరీదు. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని దర్శక దిగ్గజం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేసారు. 

ఈ సందర్భంగా  దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ… ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూసాను. చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. ఈ రోజుల్లో బాగా చదువుకున్నోళ్లు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా మంచి మంచి ఆలోచనలతో మంచి కథతో మంచి డైలాగ్స్ తో మంచి స్ర్కీన్ ప్లే తో వస్తున్నారు వెల్కమ్ థెం. చిన్న సినిమాగా చూడొద్దు మంచి సినిమాలను ఆదరిస్తే ఇంకా మంచి మంచి కుర్రోళ్ళు హీరోలుగా డైరెక్టర్స్ గా రైటర్స్ గా వస్తారు.  ఆల్ ధి బెస్ట్ ప్రశాంత్..  “ప్రాణం ఖరీదు” మూవీ టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా హీరో ప్రశాంత్ మాట్లాడుతూ… మా “ప్రాణం ఖరీదు”మూవీ థియేట్రికల్ ట్రైలర్ని దర్శక దిగ్గజం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను రాఘవేంద్రరావు గారిని అడగంగానే రేపు  ఆఫీస్ కి రమ్మని చెప్పారు. ఈ రోజు పెద్ద మనసుతో  మమ్మల్ని మా ప్రాణం ఖరీదు మూవీని ఆశీర్వదించారు. రాఘవేంద్రరావు గారికి నా తరుపున మా టీమ్ తరుపున కృతజ్ఞతలు  తెలియజేసుకుంటున్నాను. మా  ట్రైలర్ చూసి ఇంట్రెస్టింగ్ గా ఉందనడం మాకెంతో సంతోషంగా ఉంది. మా టీం ఎంతో కష్టపడి USA  లో ఇండియాలో విరామం లేకుండా షూట్ చేసాం. ప్రేక్షకులందరికీ ఖ‌చ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం. మా చిత్రం ఈ నెల 15న విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. మా ఈ ప్రయత్నాన్ని ప్రేక్షక దేవుళ్ళు మీడియా సోదరులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.
ప్రశాంత్, అవంతిక, నందమూరి తారకరత్న ,షఫి, జెమినీ సురేష్ ,చిత్రం శ్రీను, ఫణి రాజమౌళి( జబర్దస్త్ ఫేమ్) సంజన త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి టెక్నిషియన్స్ కెమెరా మెన్ : మురళి మోహన్ రెడ్డి , సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ మాటలు : మ‌రుధూరి రాజా, పి ఆర్. ఓ: కడలి రాంబాబు, నిర్మాత: నల్లమోపు సుబ్బారెడ్డి, దర్శకత్వం: పి. ఎల్.కె. రెడ్డి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here